
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ప్రపంచ రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా అరుదైన రికార్డు అందుకున్నాడు. రోహిత్ శర్మ (Rohit Sharma) కరోనా బారినపడడంతో సారథ్య బాధ్యతలు చేపట్టిన బుమ్రా.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే చెలరేగిపోయాడు. ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (Stuart Broad) వేసిన ఓవర్లో ఏకంగా 29 పరుగులు పిండుకున్నాడు. ఇందులో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు, ఒక సింగిల్ ఉంది. ఇదే ఓవర్లో బ్రాడ్ ఏకంగా ఆరు ఎక్స్‌ట్రాలు సమర్పించుకోవడం గమనార్హం.
బ్రాడ్ బౌలింగులో 29 పరుగులు రాబట్టిన బుమ్రా ఈ క్రమంలో విండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రియాన్ లారా (Brian Lara) రికార్డును బద్దలుగొట్టాడు. 2003లో జొహన్నెస్‌బర్గ్‌లో ఆర్.పీటర్సన్ బౌలింగులో లారా 28 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు అదే రికార్డు కాగా, ఇప్పుడా రికార్డును 28 ఏళ్ల బుమ్రా చెరిపేశాడు. కాగా, 2013లో జరిగిన పెర్త్ టెస్టులో జేమ్స్ అండర్సన్ బౌలింగులో జార్జ్ బెయిలీ 28 పరుగులు చేయగా, 2020లో పోర్ట్ ఎలిజబెత్‌లో జరిగిన మ్యాచ్‌లో రూట్ బౌలింగులో సౌతాఫ్రికా బ్యాటర్ కేశవ్ మహారాజ్ 28 పరుగులు చేశాడు.
ఇవి కూడా చదవండి