
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో రేపటి (శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్న ఐదో టెస్టు (రీషెడ్యూల్డ్ టెస్ట్)లో తలపడే భారత జట్టుకు పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సారథ్యం వహించనున్నాడు. ఈ మేరకు సీనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. రిషభ్ పంత్ (Rishabh Pant)ను అతడికి డిప్యూటీగా నియమించింది. సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) కరోనా బారినపడి జట్టుకు దూరమైన నేపథ్యంలో సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. లీసెస్టర్‌షైర్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో కరోనా బారినపడిన రోహిత్ ఇప్పటి వరకు కోలుకోలేదని బీసీసీఐ (BCCI) తెలిపింది.
తనను కెప్టెన్‌గా నియమించడంపై బుమ్రా సంతోషం వ్యక్తం చేశాడు. ఇది చాలా గొప్ప విజయమే కాకుండా అంతకుమించిన గౌరవమని అన్నాడు. ఈ ఉదయం కూడా తమకు కరోనా పరీక్షలు నిర్వహించారని, రోహిత్‌కు మళ్లీ పాజిటివ్ అనే నిర్ధారణ కావడంతో తనకు సారథ్య బాధ్యతలు అప్పగించారని బుమ్రా తెలిపాడు. 2018లో సౌతాఫ్రికా (South Africa)తో జరిగిన మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన బుమ్రా ఇప్పటి వరకు 29 టెస్టులు ఆడాడు. 123 వికెట్లు తీసుకున్నాడు. గతేడాది ఇంగ్లండ్ (England) పర్యటనలో నాలుగు టెస్టుల్లో ఏకంగా 18 వికెట్లు పడగొట్టాడు.
ఇవి కూడా చదవండి