
'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకున్న నాగ్ అశ్విన్.. మహానటితో ఏకంగా జాతీయ అవార్డు విన్నింగ్ మూవీని తెరకెక్కించి దక్షిణాది ప్రేక్షకులనే కాదు.. ఉత్తరాది ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ఓ భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎంటైర్ మూవీ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. కాగా.. నాగ్ అశ్విన్ దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా మారి స్వప్న సినిమాస్ బ్యానర్‌పై 'జాతి రత్నాలు' సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. నటుడిగా, స్క్రిప్ట్ రైటర్‌గా గుర్తింపు సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రంతో హీరోగా బ్రేక్ సాధించారు. ఇప్పుడు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలతో కలిసి నవీన్ పొలిశెట్టి కలిసి చేస్తున్న చిత్రం 'జాతిరత్నాలు'. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమాను మార్చి 11న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రధన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.