
Amaravathi: ముఖ్యమంత్రి జగన్ (Jagan) ప్రతీకారానికి అంతమెపుడో తెలియటం లేదని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ (Jawahar) అన్నారు. అయ్యన్న పాత్రుడు (Ayyanna patrudu) ఇంటి గోడను కూల్చడంపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ అయ్యన్నపై జగన్ పోలీసులతో దాడి చేయటం పిరికి పంద చర్య అన్నారు. ముఖ్యమంత్రి ప్రతీకారానికి బడుగులు, దళితులు బలవుతున్నారని, శని, ఆదివారం బుల్ డోజర్స్ దినంగా ప్రకటించాలని అన్నారు. మాస్క్‌లు అడిగితే దళితులను చంపారని, పరిపాలనా లోపాలను ప్రశ్నిస్తే అయ్యన్న ఇళ్ళపై పడ్డారని మండిపడ్డారు. సీఎం జగన్ పద్దతిగా మార్చుకోపోతే ఫలితం అనుభవిస్తారని జవహర్ అన్నారు.
ఇవి కూడా చదవండి