విద్యావ్యవస్థ అంటేనే జగన్‌కు వ్యతిరేక భావం: జవహర్

ABN , First Publish Date - 2022-04-24T17:46:04+05:30 IST

జగన్మోహన్ రెడ్డి వేసవి సెలవును కూడ పగ, ప్రతీకారం తీర్చుకునే సాధనంగా వాడుకుంటున్నారని...

విద్యావ్యవస్థ అంటేనే జగన్‌కు వ్యతిరేక భావం: జవహర్

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేసవి సెలవులను కూడ పగ, ప్రతీకారం తీర్చుకునే సాధనంగా వాడుకుంటున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పీఆర్సీ సమయంలో ఉపాధ్యాయులు చేసిన ధర్నాకు ప్రతీకారంగానే మే నెలలో బడులు నిర్వహిస్తున్నారని విమర్శించారు. విద్యావ్యవస్థ అంటేనే జగన్‌కు వ్యతిరేక భావం ఉందన్నారు. ఓ ప్రక్క నూతన విద్యా విధానం పేరుతో గందర గోళం సృష్టిస్తున్నారని, ఆంగ్ల మాధ్యమం పేరుతో కొంత కాలం అన్చితి నెలకొందన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌కు మంగళం పాడుతున్నారన్నారు. పీఎఫ్ ఖాతాలో సొమ్ము ప్రభుత్వం ఖాళీ చేసిందని ఆరోపించారు. వారంలో రద్దన్న సీపీయస్ అతి గతి లేదన్నారు. నాడు, నేడుతో కరోనాకు ఉపాధ్యాయులు బలైపోయారన్నారు. అమ్మ ఒడిపై ఆంక్ష ఎందుకో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తన ప్రతీకారాన్ని ఉపాధ్యాయులపై చూపడం సరికాదని జవహర్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-04-24T17:46:04+05:30 IST