ఉద్యోగులు, టీచర్లపై జగన్‌ కక్షతో ఉన్నారు: జవహర్

ABN , First Publish Date - 2022-04-25T21:14:36+05:30 IST

ఉద్యోగులు, టీచర్లపై సీఎం జగన్‌రెడ్డి కక్షతో ఉన్నారని మాజీమంత్రి జవహర్ అన్నారు.

ఉద్యోగులు, టీచర్లపై జగన్‌ కక్షతో ఉన్నారు: జవహర్

అమరావతి: ఉద్యోగులు, టీచర్లపై సీఎం జగన్‌రెడ్డి కక్షతో ఉన్నారని మాజీమంత్రి జవహర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మూడేళ్లైనా సీపీఎస్ ఎందుకు రద్దు చేయలేదు? అని ప్రశ్నించారు. ఉపాధ్యాయుల ఉద్యమం జగన్‌కు వత్తాసుగా చేస్తున్నట్లుందని ఎద్దేవా చేశారు. పీఆర్సీ సాధన కోసం గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. టీచర్లు ఉద్యమించడాన్ని సీఎం జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఆ కోపంతోనే అకడమిక్ ఇయర్‌ను మే నెలాఖరుకు పొడిగించారన్నారు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు టీచర్లకు అన్యాయం చేస్తున్నాయని చెప్పారు. ఉద్యోగ సంఘాలు పీఆర్సీ బకాయిలు సాధించలేక ఎందుకు చేతులెత్తేశాయి?  అని నిలదీశారు. జగన్‌రెడ్డికి విద్యనేర్పిన గురువులు ప్రతీకారం, దాడులే నేర్పారా? అని ప్రశ్నించారు. ఠక్కర్ కమిషన్ నివేదిక అమలు చేస్తారో లేదో చెప్పకుండా.. జగన్‌రెడ్డి దాటవేత ధోరణితో సీపీఎస్ రద్దుకు ఎన్ని కమిటీలు వేస్తారు?అని  జవహర్ నిలదీశారు. 

Updated Date - 2022-04-25T21:14:36+05:30 IST