మహిళ జుట్టుపై ఉమ్మి వేసిన ఘటన...క్షమాపణలు చెప్పిన Jawed Habib

ABN , First Publish Date - 2022-01-07T13:48:58+05:30 IST

ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్ జావేద్ హబీబ్ మహిళ జుట్టుపై ఉమ్మివేసిన వివాదంపై ఎట్టకేలకు తన మౌనాన్ని వీడారు....

మహిళ జుట్టుపై ఉమ్మి వేసిన ఘటన...క్షమాపణలు చెప్పిన Jawed Habib

లక్నో:ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్ జావేద్ హబీబ్ మహిళ జుట్టుపై ఉమ్మివేసిన వివాదంపై ఎట్టకేలకు తన మౌనాన్ని వీడారు. జావేద్‌ హబీబ్‌ సెమినార్‌లో ఓ మహిళ జుట్టుపై ఉమ్మివేసిన ఘటన వివాదాస్పదమైంది. సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో వీడియో వైరల్ అయిన వెంటనే, వేదికపై హెయిర్‌స్టైలిస్ట్ చేసిన అనాలోచిత చర్యపై నెటిజన్లు విరుచుకుపడ్డారు.ఇప్పుడు, చాలా మందికి కోపం తెప్పించిన తర్వాత, జావేద్ హబీబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తాజా వీడియోను విడుదల చేశారు. అతను ఎందుకు ఇలా చేశాడో వివరిస్తూ తన చర్యలకు జావేద్ హబీబ్ క్షమాపణలు చెప్పాడు. జావేద్‌ హబీబ్  బ్యూటీ పార్లర్‌కు పూజా గుప్తా అనే యువతి వచ్చింది. అంతరి సమక్షంలో ఆమె కుర్చీలో ఉండగా.. జావెద్ ఆమె జుట్టను దువ్వెనతో సరిచేస్తూనే.. ఉన్నట్టుండి ఆమె జుట్టుపై ఉమ్మి వేస్తాడు. 


తాను షాంపు వాడనని, ఉమ్మితోనే శుభ్రం చేస్తుంటానని చెబుతూనే ఆమె తలపై రెండు సార్లు ఉమ్మి వేశాడు.

జాతీయ మహిళా కమిషన్ నోటీసు జారీ 

కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో బహిరంగంగా ఉమ్మివేయడం శిక్షార్హమైన నేరం అని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 2005 ప్రకారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం జావేద్ హబీబ్ పై చర్య తీసుకోవాలని రాష్ట్ర పోలీసులకు జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది.జాతీయ మహిళా కమిషన్ విచారణ కోసం హెయిర్‌స్టైలిస్ట్‌కు నోటీసు పంపుతుందని అధికారులు తెలిపారు. హెయిర్‌స్టైలిస్ట్ జావేద్ హబీబ్ భారతదేశంలోని 115 నగరాల్లో 850 కంటే ఎక్కువ సెలూన్‌లు, 65 హెయిర్ అకాడమీలను నిర్వహిస్తున్నారు.


Updated Date - 2022-01-07T13:48:58+05:30 IST