తెలుగురాష్ట్రాల్లో అప్పుల భారం పెరిగిపోతోంది: జయప్రకాష్ నారాయణ

ABN , First Publish Date - 2022-09-06T00:33:35+05:30 IST

తెలుగురాష్ట్రాల్లో అప్పుల భారం పెరిగిపోతోందని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ (Jaya Prakash Narayana) ఆందోళన వ్యక్తం చేశారు.

తెలుగురాష్ట్రాల్లో అప్పుల భారం పెరిగిపోతోంది: జయప్రకాష్ నారాయణ

హైదరాబాద్: తెలుగురాష్ట్రాల్లో అప్పుల భారం పెరిగిపోతోందని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ (Jaya Prakash Narayana) ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వడ్డీలకే కొన్ని వేల కోట్లు చెల్లిస్తున్నారని తెలిపారు. అప్పు చేసి ఎవరూ పప్పు కూడు తినకూడదని, ప్రభుత్వాలు అప్పు చేసి పప్పు కూడు తింటున్నాయని తప్పుబట్టారు. చాలా రాష్ట్రాల్లో ఇదే తీరు ఉందని పేర్కొన్నారు. ఒడిషాను చూసి తెలుగురాష్ట్రాలు ఎంతో నేర్చుకోవాలని జేపీ సూచించారు. దేశంలో ఆర్థిక క్రమశిక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అప్పులను వాడాలి.. అంతేకాని సాధారణంగా ఖర్చు కోసం వాడకూడదని జయప్రకాష్ నారాయణ సూచించారు.

Updated Date - 2022-09-06T00:33:35+05:30 IST