డిపాజిట్‌దారులకు జయలక్ష్మి కో- ఆపరేటెవ్ సొసైటీ కుచ్చుటోపీ

ABN , First Publish Date - 2022-04-06T22:34:40+05:30 IST

జిల్లాలోని కాకినాడలోగల ది జయలక్ష్మి కో- ఆపరేటెవ్ సొసైటీ

డిపాజిట్‌దారులకు జయలక్ష్మి  కో- ఆపరేటెవ్ సొసైటీ  కుచ్చుటోపీ

కాకినాడ: జిల్లాలోని కాకినాడలోగల ది జయలక్ష్మి కో- ఆపరేటెవ్ సొసైటీ డిపాజిట్‌దారులకు కుచ్చుటోపీ పెట్టింది. ఖాతాదారులకు నాలుగు నెలలుగా  వడ్డీల చెల్లింపును నిలుపుదల చేసింది. తమ డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయాలని సొసైటీ బ్యాంకు వద్ద ఖాతాదారులు ఆందోళన చేశారు. కాకినాడ లో ది జయలక్ష్మి కో ఆపరేటెవ్ సొసైటీ హెడ్ ఆఫీస్ వద్దకు భారీ సంఖ్యలో డిపాజిట్‌దారులు రోజూ వస్తుంటారు.  అయితే విషయం బయటపడడంతో బ్యాంక్ చైర్మన్  ఆచూకీ లేకుండా పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28 బ్రాంచ్‌ల్లోని  ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.  కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుమారు 500 కోట్లు డిపాజిట్లను ఖాతాదారుల నుంచి సేకరించినట్లు అంచనా వేస్తున్నారు. ఒక్క పిఠాపురం బ్రాంచ్ లోనే 700మంది ఖాతాదారులు నుండి రూ.16 కోట్లు డిపాజిట్లను సేకరించారు. 

Updated Date - 2022-04-06T22:34:40+05:30 IST