టాలీవుడ్ వైపు చూస్తున్న జయం రవి..!

May 7 2021 @ 16:50PM

తమిళ హీరో జయం రవి టాలీవుడ్‌లో అవకాశాల కోసం చూస్తున్నట్టు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన రవి కోలీవుడ్‌లో జయం సినిమాతో హీరోగా మారాడు. తెలుగులో వచ్చిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, జండాపై కపిరాజు తమిళంలో రీమేక్ సినిమాలలో నటించి క్రేజీ హీరోగా పాపులరయ్యాడు. గత ఏడాది తమిళంలో వచ్చిన భూమి సినిమాతో హిట్ అందుకున్నాడు. కాగా ఇప్పుడు తెలుగు సినిమాలలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. కమల్ హాసన్, రజనీకాంత్, విజయ్, అజిత్, ఆర్య, విక్రం, సూర్య, కార్తి, ధనుష్..ఇలా కోలీవుడ్ స్టార్ హీరోలందరు తమ సినిమాలను తెలుగులో డబ్ చేస్తూ ఇక్కడ ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్  సంపాదించుకున్నారు. ఈ మధ్య విజయ్ సేతుపతి కూడా తెలుగు సినిమాలలో అవకాశాలు అందుకుంటూ మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే జయం రవి కూడా తెలుగులో మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నాడట. మరి ఈ హీరోకి టాలీవుడ్ మేకర్స్ అవకాశాలు ఇస్తారా లేదా చూడాలి. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.