జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని గణపురం మండలం చెల్పూర్ కే.టి*.పి.పి కాలనీలో డీఈ రాజేందర్ ఇంట్లో దుండగులు చోరీకి తెగబడ్డారు. గత రాత్రి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు 9 తులాల బంగారం, రూ.45 వేల నగదును అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.