మేడిగడ్డ బ్యారేజీ వద్ద 57 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-09-15T15:13:44+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద వదర ప్రవాహం అధికంగా ఉంది. దీంతో అధికారులు 57 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

మేడిగడ్డ బ్యారేజీ వద్ద 57 గేట్లు ఎత్తివేత

జయశంకర్ భూపాలపల్లి:  కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద  వదర ప్రవాహం అధికంగా ఉంది. దీంతో అధికారులు 57 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 4,17,760 క్యూసెక్కులుగా ఉంది. అలాగే బ్యారేజీ పూర్తి సామర్ధ్యం 16.17 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటిమట్టం 2.741 టీఎంసీలుగా కొనసాగుతోంది. అటు అన్నారం (సరస్వతీ) బ్యారేజీ వద్ద వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు 15 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ ఇన్ ఫ్లో 1,03,786, ఔట్ ఫ్లో 72,000 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ పూర్తి సామర్ధ్యం10.87 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి మట్టం 6.06 టీఎంసీలుగానమోదు అయ్యింది. 

Updated Date - 2021-09-15T15:13:44+05:30 IST