తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపిన వ్యక్తి జయశకంర్‌

ABN , First Publish Date - 2020-08-07T05:41:44+05:30 IST

తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపిన వ్యక్త్తి ప్రొఫెసర్‌ జయశంకర్‌ అని కేంద్ర సమాచారశాఖ మాజీ కమిషనర్‌ మాడభూషి

తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపిన వ్యక్తి జయశకంర్‌

 కేంద్ర సమాచారశాఖ మాజీ కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌

 బండి చంద్రశేఖర్‌కు రాష్ట్రస్థాయి పురస్కార ప్రదానం


కరీంనగర్‌ కల్చరల్‌, ఆగస్టు 6: తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపిన వ్యక్త్తి ప్రొఫెసర్‌ జయశంకర్‌ అని కేంద్ర సమాచారశాఖ మాజీ కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ అన్నారు. గురువారం దేవరకొండ కాళిదాసు, డీకే ఫౌండేషన్‌ సౌజన్యంతో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో కరీంనగర్‌కు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ బండి చంద్రశేఖర్‌కు  జయశంకర్‌ స్ఫూర్తి పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించన వెబ్‌నార్‌లో ఆయన ప్రసంగించారు. జయశంకర్‌ స్ఫూర్తితో పనిచేసిన నిఖార్సైన తెలంగాణవాది చంద్రశేఖర్‌కు పురస్కారం అందజేయడం అభినందనీయమన్నారు. బహుభాషావేత్త డాక్టర్‌ నలిమెల భాస్కర్‌, పురస్కార ప్రదాత దేవరకొండ కాళిదాసు, తెరవే రాష్ట్ర అధ్యక్షుడు గాజోజు నాగభూషణం, ఆస్ర్టేలియా నుంచి వేదాంతం సూరి మాట్లాడుతూ జయశంకర్‌ స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు ఈ పురస్కారం తోడ్పడుతుందని అన్నారు.


అనంతరం జయశంకర్‌ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని, కొత్త సచివాలయ ముఖద్వారానికి ఆయన పేరు పెట్టాలని, వరంగల్‌లో స్మృతివనం, రాష్ట్రస్థాయిలో జయశంకర్‌ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని, వరవరరావును విడుదల చేయాలని తీర్మానించారు. అంతకుముందు తెలంగాణ చౌక్‌లో చంద్రశేఖర్‌కు ఐదు వేల రూపాయల నగదు, పురస్కారాన్ని తెరవే బాధ్యులు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి కూకట్ల తిరుపతి, అన్నవరం దేవేందర్‌, కందుకూరి అంజయ్య, బూర్ల వెంకటేశ్వర్లు, సదాశ్రీ, కొండి మల్లారెడ్డి, ఎర్రోజు వెంకటేశ్వర్లు, మేరుగు అంజయ్య, గంగాధర్‌, విలాసాగరం రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-07T05:41:44+05:30 IST