Jazeera Airways: భారత ప్రవాసులకు జజీరా ఎయిర్‌వేస్ గుడ్‌న్యూస్ .. భారత్‌లోని ఆ రెండు నగరాలకు కొత్త విమాన సర్వీసులు

ABN , First Publish Date - 2022-09-20T15:39:47+05:30 IST

కువైత్‌కు చెందిన విమానయాన సంస్థ జజీరా ఎయిర్‌వేస్ (Jazeera Airways) తాజాగా కీలక ప్రకటన చేసింది. భారత్‌లోని తిరువనంతపురం (Thiruvananthapuram), బెంగళూరు (Bangalore) నగరాలకు కొత్త విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది.

Jazeera Airways: భారత ప్రవాసులకు జజీరా ఎయిర్‌వేస్ గుడ్‌న్యూస్ .. భారత్‌లోని ఆ రెండు నగరాలకు కొత్త విమాన సర్వీసులు

ఎన్నారై డెస్క్: కువైత్‌కు చెందిన విమానయాన సంస్థ జజీరా ఎయిర్‌వేస్ (Jazeera Airways) తాజాగా కీలక ప్రకటన చేసింది. భారత్‌లోని తిరువనంతపురం (Thiruvananthapuram), బెంగళూరు (Bangalore) నగరాలకు కొత్త విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. వారంతో రెండు రోజులు (మంగళ, ఆదివారం) కువైత్ నుంచి తిరువనంతపురంకు విమాన సర్వీస్ ఉంటుందని తెలిపింది. అలాగే తిరువనంతపురుం నుంచి కువైత్‌కు ఇవే విమానాలు బుధ, సోమవారం తెల్లవారుజామున బయల్దేరుతాయని ఎయిర్ జజీరా పేర్కొంది. ఇక కువైత్-బెంగళూరు మార్గంలో గురు, ఆదివారం విమాన సర్వీసులు నడనున్నట్లు తెలియజేసింది. రిటర్న్ విమానాలు (బెంగళూరు నుంచి కువైత్‌కు) శుక్ర, సోమవారం ఉదయం ఉంటాయని తెలిపింది. 


కాగా, కువైత్-తిరువనంతపురం విమాన సర్వీస్‌ను అక్టోబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. విమానం జే-9 411 మంగళ, ఆదివారం నాడు కువైత్ నుంచి సాయంత్రం 6.25 గంటలకు (కువైత్ కాలమానం ప్రకారం) బయల్దేరి, తిరువనంతపురానికి తర్వాతి రోజు తెల్లవారుజామున 2.05 గంటలకు (భారత కాలమానం ప్రకారం) చేరుకుంటుంది. అలాగే బుధ, సోమవారం జే-9 412 విమానం తిరువనంపురం నుంచి తెల్లవారుజామున 2.50 గంటలకు బయల్దేరి, అదేరోజు సాయంత్రం 05.55 గంటలకు (కువైత్ కాలమానం ప్రకారం) కువైత్ చేరుకుంటుంది. ఇక కువైత్-బెంగళూరు సర్వీస్ జే-9 432 గురు, శనివారం రోజుల్లో సాయంత్రం 6.00 గంటలకు (కువైత్ కాలమానం ప్రకారం) కువైత్ నుంచి బయల్దేరుతుంది. ఆ తర్వాతి రోజు తెల్లవారుజామున 01.15 గంటలకు (భారత కాలమానం ప్రకారం) బెంగళూరు చేరుకుంటుంది. ఆ తర్వాత శుక్ర, ఆదివారం నాడు తెల్లవారుజామున 2.00 గంటలకు బెంగళూరు నుంచి బయల్దేరి, అదే రోజుల్లో సాయంత్రం 04.50 గంలకు కువైత్‌కు చేరుకుంటుంది.  


ఈ కొత్త విమాన సర్వీసుల గురించి జజీరా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO) రోహిత్ రామచంద్రన్ మాట్లాడుతూ, “ఈ రెండు కొత్త సర్వీసుల ద్వారా కువైత్‌లోని ప్రవాసులు, వ్యాపార వర్గాల నుండి ఉన్న అధిక డిమాండ్‌ను తీర్చడం ద్వారా భారతదేశంలోకి మా పరిధిని విస్తరింపజేయడం సంతోషంగా ఉందన్నారు. విమానాల కోసం ఇతర కనెక్టింగ్ జీసీసీ (GCC) దేశాల నుండి కూడా ఇదే మాదిరి భారీ డిమాండ్ ఉన్నందున కొత్త మార్గాల్లో సర్వీసులు నడుపుతున్నామని" అన్నారు.  

Updated Date - 2022-09-20T15:39:47+05:30 IST