విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు

ABN , First Publish Date - 2020-12-03T04:38:42+05:30 IST

ఉద్యోగ విధుల్లో అలసత్వం వహిస్తే శాఖా పరంగా చర్యలు తీసుకుంటామని జాయింట్‌ కలెక్టర్‌ నంభూరి తేజ్‌భరత్‌ తెలిపారు.

విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
సమీక్షలో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ తేజ్‌భరత్‌

జాయింట్‌ కలెక్టర్‌ నంభూరి తేజ్‌భరత్‌

పెదపాడు, డిసెంబరు 2: ఉద్యోగ విధుల్లో అలసత్వం వహిస్తే శాఖా పరంగా చర్యలు తీసుకుంటామని జాయింట్‌ కలెక్టర్‌ నంభూరి తేజ్‌భరత్‌ తెలిపారు. ఇళ్ల స్థలాలు, గ్రామ సచివాలయాల నిర్మా ణాల ప్రగతిపై వివిధ శాఖల అధికారులతో జేసీ తేజ్‌భరత్‌ ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. గ్రామాల వారీగా ఇళ్లస్థలాల మెరక పనులు, గ్రామ సచివాలయాల నిర్మాణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 25వ తేదీ నాటికి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని, గడువు తేదీలోగా స్థలాల అభివృద్ధి పనులను నూరుశాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మండలంలో కొన్ని గ్రామాల్లో పనుల్లో అలసత్వం కన్పిస్తోందని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామ సచివాలయాల భవన నిర్మాణాలను మార్చి 30 నాటాకి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాల న్నారు. కార్యక్రమంలో తహసీల్దారు ఇందిరాగాంధీ, ఎంపీడీవో నిర్మలజ్యోతి, ఎన్‌ఆర్‌జీఎస్‌ ఏపీఎం దశరథ్‌ రాంజీ, సూపరింటెండెంట్‌ విశ్వనాథం, వైసీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ సతీశ్‌, ఏఎంసీ డైరెక్టర్‌ ఘంటశాల ప్రభాకరరావు, కత్తుల రవి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-03T04:38:42+05:30 IST