జేసీ ఆదేశాలు బేఖాతరు

Nov 30 2021 @ 23:14PM

రేషన్‌ దుకాణాలకు చేరని బియ్యం


తోటపల్లిగూడూరు, నవంబరు 30 : డిసెంబరు 4, 5 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో డిసెంబరు 1వ తేదీ నుంచి పంపిణీ చేయాల్సిన పీడీఎస్‌ బియ్యాన్ని నవంబరు 30 నుంచే పంపిణీ చేయాలంటూ జేసీ హరేందిర ప్రసాద్‌ నుంచి అత్యవసర ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే సంబంధిత శాఖల అధికారులు ఆ ఆదేశాలను బేఖాతరు చేశారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు లబ్ధిదారులకు పీడీఎస్‌ బియ్యం పంపిణీ చేయాలి. అయితే డిసెంబరు 4, 5 తేదీల్లో భారీ వర్ష సూచన నేపథ్యంలో నవంబరు 30వ తేదీ నుంచి బియ్యం పంపిణీ చేయాలని జేసీ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం 7గంటలకే మొబైల్‌ డిస్ర్టిబ్యూషన్‌ యూనిట్‌ (ఎండీయూ) ఆపరేటర్లు రేషన్‌ షాపుల వద్దకు చేరుకున్నారు. అయితే సివిల్‌ సప్లయీస్‌ అధికారుల నుంచి రేషన్‌ దుకాణాలకు బియ్యం పంపిణీ కాలేదు. దాంతో ఆపరేటర్లు వెనుదిరిగారు. కాగా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నుంచి అత్యవసర ఆదేశాలు జారీ అయినప్పటికీ బియ్యం రేషన్‌ దుకాణాలకు చేరకపోవడం చర్చనీయాంశంగా మారింది. 

 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.