
అనంతపురం: పుట్టపర్తిలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మా నాన్న ప్రత్యేకంగా పుట్టపర్తి పై దృష్టి సారించారనడం తప్పు. మా లక్ష్యం మరోసారి చంద్రబాబును సీఎం చేయడమే. లక్ష్యసాధనలో ఎవరికి టికెట్టు వచ్చినా రాకున్నా బాధపడేది లేదు.మా నియోజకవర్గంలో మాకంటే కష్టపడే వారు ముందుకొస్తే స్వచ్ఛందంగా టికెట్ వదులుకుంటాం. పల్లె రఘునాథరెడ్డి గురించి మాట్లాడే అంత వయస్సు నాకు లేదు.’’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు విజన్ ని మెచ్చుకున్న ఏకైక నాయకుడు జెసి ప్రభాకర్ రెడ్డేనన్నారు. సీఎం చంద్రబాబు కావడం కోసం తమకు టిక్కెట్టు ఇవ్వకున్నా పర్వాలేదని జేసీ అస్మిత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి