నెల్లూరు వరద బాధితులకు దాతల వితరణ

ABN , First Publish Date - 2021-11-27T05:06:11+05:30 IST

నెల్లూరు తుపాను బాధితుల సహాయార్థం దాతల సహకారంతో 10 రకాల సరుకులతో ప్యాకింగ్‌ చేసిన రూ.50 లక్షల విలువైన 3 వేల బ్యాగులను పంపుతున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు.

నెల్లూరు వరద బాధితులకు దాతల వితరణ
నెల్లూరుకు నిత్యవసర సరుకులు పంపుతున్న జిల్లా యంత్రాంగం

రూ.50 లక్షల విలువ చేసే నిత్యవసర సరుకుల సరఫరా

గుంటూరు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు తుపాను బాధితుల సహాయార్థం దాతల సహకారంతో 10 రకాల సరుకులతో ప్యాకింగ్‌ చేసిన రూ.50 లక్షల విలువైన 3 వేల బ్యాగులను పంపుతున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ వద్ద నుంచి ఆయన లారీలను జెండా ఊపి ప్రారంభించారు. ఐటీసీ, భారతీ సోప్‌ వర్క్స్‌, ఏపీ డాల్‌ మిల్లర్స్‌, స్పిన్నింగ్‌ మిల్స్‌, ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తదితర సంస్థలు ముందుకొచ్చి రూ.50 లక్షలు సమకూర్చాయని చెప్పారు.  రెండు, మూడు రోజుల్లో చిత్తూరు, కడప జిల్లాల వరద బాధితులకు కూడా నిత్యావసర సరుకులు సేకరించి పంపిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో భారతీ సోప్‌వర్క్స్‌ అధినేత అరుణాచలం మాణిక్యవేలు, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, భూసర్వే డిప్యూటీ కలెక్టర్‌ భాస్కర్‌నాయుడు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ టి.శివరాంప్రసాద్‌, అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ షేక్‌ గౌస్‌మొహిద్దీన్‌, తహసీల్దార్‌ శ్రీకాంత్‌, సామాజిక కార్యకర్త సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

 తిరుపతికి నిత్యావసర సరుకులు..

 పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతికి నిత్యావసర సరుకుల లారీ పంపారు. ఐదువేల మినీకిట్ల లారీని శుక్రవారం రాత్రి పంపినట్లు మెప్మా పీడీ వెంకట నారాయణ తెలిపారు. 

 


Updated Date - 2021-11-27T05:06:11+05:30 IST