పథకాల అర్హుల పేర్లు తెలుగులో ఉండాలి : జేసీ

ABN , First Publish Date - 2020-12-04T04:47:40+05:30 IST

సచివాలయాల్లో పనులన్నీ వేగవంతంగా నిర్వహించాలని జేసీ తేజ్‌భరత్‌ అన్నారు. గణ పవరం, సరిపల్లె గ్రామ సచి వాలయాలను గురువారం తనిఖీ చేశారు.

పథకాల అర్హుల పేర్లు తెలుగులో ఉండాలి : జేసీ

గణపవరం, డిసెంబరు 3 : సచివాలయాల్లో పనులన్నీ వేగవంతంగా నిర్వహించాలని జేసీ తేజ్‌భరత్‌ అన్నారు. గణ పవరం, సరిపల్లె గ్రామ సచి వాలయాలను గురువారం  తనిఖీ చేశారు. సచివాలయా ల్లో రికార్డులన్ని సక్రమంగా నిర్వ హించాలన్నారు.సంక్షేమ పథకాల అర్హుల పేర్లను జాబితా ఇంగ్లీషులో కాకుండా తెలుగులో నమోదు చేయా లన్నారు. సచివాలయాల్లోనే మీ సేవలు అందించేలా కృషి చేయాలన్నారు. సంక్షేమ పథకాల అమలు తీరు, అర్హుల జాబితాలు, స్పందన అర్జీలు, ఉద్యో గుల హాజరు రిజిస్టర్లు తనిఖీ చేశారు. సచివాలయ, రైతు భరోసా కేంద్రాలు భనవ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఆయన వెంట ఈవోపీఆర్‌డీ పీవీ.సత్యనారాయణ, గణపవరం, సరిపల్లె గ్రామ సచివాలయ కార్యదర్శులు శివరామ్‌ ప్రసాద్‌, సుంకర వెంకటేష్‌ ఉన్నారు. 

Updated Date - 2020-12-04T04:47:40+05:30 IST