వికటించిన మధ్యాహ్న భోజనం

ABN , First Publish Date - 2021-03-07T05:38:44+05:30 IST

మధ్యాహ్న భోజనం వికటించడంతో 13 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మండలంలోని బొమ్మువానిపాలెం మండల పరిషత్‌ ప్రాఽథమిక పాఠశాలలో శనివారం జరిగింది.

వికటించిన మధ్యాహ్న భోజనం
కొల్లిపర సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న విద్యార్థులు

13మంది విద్యార్థులకు అస్వస్థత

జేసీ ప్రశాంతి పరామర్శ

కొల్లిపర, తెనాలి రూరల్‌, మార్చి 6 : మధ్యాహ్న భోజనం వికటించడంతో 13 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మండలంలోని బొమ్మువానిపాలెం మండల పరిషత్‌ ప్రాఽథమిక పాఠశాలలో శనివారం జరిగింది. మొత్తం 18 మంది విద్యార్థుల్లో 13 మంది పాఠశాలలో భోజనం చేశారు. కొంత సమయానికి అందరికీ కడుపు నొప్పిరాగా వారిలో ఆరుగురు విద్యార్థులకు వాంతులయ్యాయి. ఆందోళన చెందిన తల్లిదండ్రులు చిన్నారులను కొల్లిపరలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకు వచ్చారు. మెరుగైన వైద్యం కోసం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు 108 ద్వారా తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అబ్జర్వేషన్‌లో ఉంచామని వైద్యశాల ఆర్‌ఎంవో డాక్టర్‌ అర్జా రాజేంద్ర చెప్పారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను జేసీ ప్రశాంతి పరామర్శించారు. చిన్నారుల ఆరోగ్యంపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సనత్‌కుమారిని అడిగితెలుసుకున్నారు.  

Updated Date - 2021-03-07T05:38:44+05:30 IST