హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారి పట్ల వివక్ష తగదు

ABN , First Publish Date - 2021-12-02T06:13:53+05:30 IST

హెచ్‌ఐవీ పాజిటివ్‌ వ్యక్తుల పట్ల వివక్ష చూపడం తగదని సంయుక్త కలెక్టర్‌ (గ్రామ సచివాలయాలు/అభివృద్ది) జి.రాజకుమారి అన్నారు.

హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారి పట్ల వివక్ష తగదు
జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న జేసీ రాజకుమారి

సంయుక్త కలె క్టర్‌ రాజకుమారి 

గుంటూరు(మెడికల్‌), డిసెంబరు 1: హెచ్‌ఐవీ పాజిటివ్‌ వ్యక్తుల పట్ల వివక్ష చూపడం తగదని సంయుక్త కలెక్టర్‌ (గ్రామ సచివాలయాలు/అభివృద్ది) జి.రాజకుమారి అన్నారు. హెచ్‌ఐవీ నిర్మూలన కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ మహిళా కళాశాలలో బుధవారం జరిగిన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. తొలుత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద ఎయిడ్స్‌ అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం హెచ్‌ఐవీపై అవగాహన కల్పించే పోస్టర్లు, ప్రచార చిత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ జే యాస్మిన్‌, స్టెప్‌ సీఈవో డాక్టర్‌ వి.శ్రీనివాస్‌రావు, అడిషనల్‌ డీఎంహెచ్‌వో (లెప్రసీ/ఎయిడ్స్‌) డాక్టర్‌ బండారు సుబ్బారావు, మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బీఆర్‌ జోత్స్నాదేవి, ఆర్‌ఆర్‌సీ డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ హనుమంతరావు, డీపీఎం ఎల్‌.మధుసూదనరావు, ఐసీటీసీ డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌ జ్యోతుల వీరాస్వామి, శ్రీవిద్య, ఏవో శ్రీనివాస్‌, స్టెప్‌ కార్యాలయ పరిపాలనాధికారి రాధిక, షిప్‌ ప్రెసిడెంట్‌ ఎ.రమాదేవి, డాక్టర్‌ రమణ యశస్వి, చంద్రకళ, డీపీవో డాక్టర్‌ రామారావు, విద్యార్థినులు, స్వచ్చంధ సంస్థల  సభ్యులు పాల్గొన్నారు. 

  

Updated Date - 2021-12-02T06:13:53+05:30 IST