Advertisement

కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించిన జేసీ సిరి

Feb 23 2021 @ 00:44AM
బీఎ్‌సఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలను పరిశీలిస్తున్న జేసీ సిరి

ధర్మవరంఅర్బన్‌, ఫిబ్రవరి 22: మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌ కోసం ఏర్పాటుచేసిన కేంద్రాలను జాయింట్‌ కలెక్టర్‌ సిరి, ఆర్డీఓ మధుసూదన్‌, కమిషనర్‌ మల్లికార్జునలు పరిశీలించారు. పట్టణంలోని సంజయ్‌నగర్‌లోని బీఎ్‌సఆర్‌ బాలుర, బాలికల ఉన్నతపాఠశాలలోని తరగతి గదులను సోమవారం జేసీసిరితో పాటు ఆర్డీఓ, కమిషనర్‌ పరిశీలించారు. మార్చి 14న ఓట్లలెక్కింపు ఉంటుంది. ఓట్ల లెక్కింపునకు అనువైన గదులను పరిశీలించారు. ఒక్కోగదిలో మూడు లేదా నాలుగు వార్డులకు సంబంధించిన ఓట్లను లెక్కించేందుకు ఏఏ సదుపాయాలు కల్పించాలో వా టిపై అధికారులు చర్చించారు. కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలను ఏర్పాటుచేయాలని, ఎటువంటి సమస్యలు రాకుండా చూడాలని కమిషనర్‌ను ఆదేశించారు. అంతేకాకుండా మీడియాకు ప్రత్యేక సెల్‌ ఏర్పాటుచేయాలన్నారు. అనంతరం పట్టణంలో అనివార్యకారణాల వల్ల మార్పులు చేసిన పోలింగ్‌ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ పరిశీలనలో మున్సిపల్‌ డీఈ వన్నూర్‌స్వామి, ఆర్‌ఐ రవి ఉన్నారు.


పుట్టపర్తి: మున్సిపల్‌ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ సిరిఅధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్స్‌లను భద్రత పరిచే స్ట్రాంగ్‌ రూంలను పరిశీలించారు, రెండు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి తగిన సూచనలు చేశారు. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు ముందస్తుగా చూసుకోవాలని సూచించారు. జేసీ వెంట కమీషనర్‌ శివరామిరెడ్డి, తహసీల్దార్‌ గోపాలక్రిష్ణ,ఏఈ మురళి పాల్గొన్నారు.


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.