జేడీఎస్‌ వైపు తేజశ్విని చూపు?

ABN , First Publish Date - 2021-07-30T17:31:37+05:30 IST

కేంద్ర ప్రభుత్వంలో నెంబర్‌ టూగా ఉంటూ కన్నుమూసిన బీజేపి అగ్రనేత అనంతకుమార్‌ సతీమణి జెడిఎస్‌ తీర్ధం పుచ్చుకునే అవకాశాలున్నాయా? ముఖ్యమంత్రి పద

జేడీఎస్‌ వైపు తేజశ్విని చూపు?

                      - కుమార్తె ట్వీట్‌తో సర్వత్రా కుతూహలం


బెంగళూరు: కేంద్ర ప్రభుత్వంలో నెంబర్‌ టూగా ఉంటూ కన్నుమూసిన బీజేపి అగ్రనేత అనంతకుమార్‌ సతీమణి జెడిఎస్‌ తీర్ధం పుచ్చుకునే అవకాశాలున్నాయా? ముఖ్యమంత్రి పదవి దక్కక తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న బ్రాహ్మణ కులస్థులకు వలవేసేందుకు దళపతి మాజీ ప్రధాని హెచ్‌డి.దేవెగౌడ చక్రం తిప్పుతున్నారా? దివంగత అనంతకుమార్‌ కుమార్తె విజేత అనంత్‌ తాజాగా చేసిన ట్వీట్‌ బీజేపిలో తీవ్రకలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో జెడిఎస్‌ ఇంకా బలంగానే ఉందని రాష్ట్ర రాజకీయాలు చాలా ఆసక్తిదాయకంగా మారిపోతున్నాయంటూ ఆమె ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌తో సర్వత్రా కుతూహలం నెలకొని ఉంది. అనంతకుమార్‌ మృతి అనంతరం ఆయన సతీమణి తేజశ్వినికి బీజేపీ లో ప్రాధాన్యత లేకుండా పోయింది. భర్త ప్రాతినిథ్యం వహించిన బెంగళూరు దక్షిణ పోటీ చేయాలని భావించి ఆమె భంగపడ్డారు. రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవి ఇచ్చి నేతలు సరిపుచ్చారు. కుమార్తె ట్వీట్‌ను తేలిగ్గా తీసిపారేయలేమని రానున్న రోజుల్లో తేజశ్విని అనంతకుమార్‌ జేడీఎస్‌లో చేరే అవకాశం లేకపోలే దని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తేజశ్విని ఒక వేళ జేడీఎస్‌లో చేరదలిస్తే అందుకు ఆత్మీయ స్వాగతం పలుకుతామని పార్టీలో సముచిత స్థానం కల్పి స్తామని మాజీ సీఎం కుమారస్వామి కూడా ట్వీట్‌ చేయడం విశేషం. జనతా పరివార్‌కు చెందిన నేతలు ముఖ్యమంత్రులు అవుతుండడం, బీజేపీ కోసం త్యాగాలు చేసినవారిని పక్కన పెట్టడం వంటి పరిణా మాలు ఒరిజినల్‌ బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదు. వారు తమ రాజకీయ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారు. 


Updated Date - 2021-07-30T17:31:37+05:30 IST