జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తాచాటిన విశాఖ విద్యార్థులు

ABN , First Publish Date - 2021-10-17T06:28:49+05:30 IST

ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ-అడ్వాన్స్‌డ్‌-2021లో విశాఖ విద్యార్థులు మంచి ప్రతిభ చూపారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తాచాటిన విశాఖ విద్యార్థులు

ఓపెన్‌ కేటగిరీలో 126, 127, 148, 162, 232, 462, 468 ర్యాంకులు సాధన



విశాఖపట్నం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ-అడ్వాన్స్‌డ్‌-2021లో విశాఖ విద్యార్థులు మంచి ప్రతిభ చూపారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 1000 మంది వరకు ఐఐటీలు/ ఇతర ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్లు పొందే ర్యాంకులు సాధిం చారు. వివిధ రిజర్వుడ్‌ కేటగిరీలలో 100లోపు ఏడుగురు, 500లోపు ముగ్గురు ర్యాంకులు సాధించారు. ఓపెన్‌ కేటగిరీలో వావిలపల్లి బాలాజీ సిద్ధార్థ 126వ ర్యాంకు (ఓబీసీలో పదో ర్యాంకు), పట్నాల యశ్వంత్‌ నారాయణ 127, బి.జ్యోతికా చౌదరి 148, కె.వివేక్‌ 162వ ర్యాంకు (ఎస్సీ కేటగిరీలో రెండో ర్యాంకు), పి.హేమంత్‌నాయుడు 232 (ఓబీసీలో 22వ ర్యాంకు)వ ర్యాంకు, పారుపూడి సిద్ధార్థ 462వ ర్యాంకు సాధించారు. ఇంకా పి.అనంతపవన్‌ భరద్వాజ 468, జామి రవీనా 508 (ఓబీసీలో 56వ ర్యాంకు), కె.సత్యకిరణ్‌ 514, కె.సూర్యగోపాలచంద్ర 549వ ర్యాంకు (ఓబీసీలో 61వ ర్యాంకు), బి.సాయిసాత్విక్‌ 588వ ర్యాంకు, ఇజ్జాడ హరిస్వత 597వ ర్యాంకు (ఓబీసీలో 70వ ర్యాంకు), ఎం.వీరవెంకట్‌ రామఅఖిల్‌ 677, ఇంద్రనీల్‌ మనోజ్‌ 705వ ర్యాంకు, జి.తోయజాక్షి 753 (ఈడబ్ల్యుఎస్‌లో 67వ ర్యాంకు), జి.సాయి విష్ణుసాత్విక్‌ 867, టి.వల్లభ్‌ 896వ ర్యాంకు సాధించారు. 

Updated Date - 2021-10-17T06:28:49+05:30 IST