త్వరలో జీవితారాజశేఖర్‌ను అరెస్ట్ చేస్తారు: హేమ

ABN , First Publish Date - 2022-04-22T23:49:23+05:30 IST

నగరి కోర్టులో నటి జీవితారాజశేఖర్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందని, త్వరలో ఆమెను అరెస్ట్ చేస్తారని జ్యోస్టర్ ఎండీ హేమ తెలిపారు.

త్వరలో జీవితారాజశేఖర్‌ను అరెస్ట్ చేస్తారు: హేమ

తిరుపతి: నగరి కోర్టులో నటి జీవితారాజశేఖర్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందని, త్వరలో ఆమెను అరెస్ట్ చేస్తారని జ్యోస్టర్ ఎండీ హేమ తెలిపారు. జీవితపై జ్యోస్టర్ ఎండీ హేమ దంపతుల ఆరోపణలు చేశారు. గరుడ వేగ సినిమా నిర్మాణం కోసం జీవితారాజశేఖర్ దంపతులకు రూ.26 కోట్లు అప్పు ఇచ్చామని తెలిపారు. అప్పుకోసం ఆస్తి డాక్యుమెంట్లు తనఖా పెట్టారని, అయితే తమకు తెలియకుండా ఆ ప్రాపర్టీని మరొకరికి అమ్మారని తెలిపారు. జీవితా రాజశేఖర్‌ రూ.26 కోట్లు ఎగ్గొట్టారని చెప్పారు. ఈ వ్యవహారంపై తిరువాళ్లూరులో కేసు పెట్టామని ఆమె పేర్కొన్నారు. జీవితా రాజశేఖర్‌పై చెక్‌బౌన్స్‌ కేసు నడుస్తోందని హేమ తెలిపారు.

Updated Date - 2022-04-22T23:49:23+05:30 IST