రాజానగరంలో ఆభరణాల చోరీ

ABN , First Publish Date - 2021-07-27T05:38:43+05:30 IST

ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో భద్రపర్చిన రూ.3.10 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దుండగులు అపహరించినట్టు సీఐ ఎంవీ సుభాష్‌ సోమవారం తెలిపారు.

రాజానగరంలో ఆభరణాల చోరీ

రాజానగరం, జూలై 26: ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో భద్రపర్చిన రూ.3.10 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దుండగులు అపహరించినట్టు సీఐ ఎంవీ సుభాష్‌ సోమవారం తెలిపారు. యండమూరి వీరేంద్ర సతీ్‌షరామ్‌ రాజానగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌ ప్లాట్‌లో నివసిస్తున్నాడు. ఆయన కోటపాడులోని లిక్కర్‌ గొడౌన్‌లో అక్కౌంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి రావులపాలెంలోని అక్క ఇంటికి వెళ్లాడు. ఇంటి తలుపులు తెరిసి ఉండడాన్ని గమనించిన పక్కింటివాళ్లు యజమానికి సమాచారం అందించారు. వచ్చి చూసేసరికి బీరువాలో భద్రపర్చిన 53 గ్రాముల బంగారు, 98 గ్రాముల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే ఎదురుగా ఉన్న ఇంట్లోకి కూడా చోరీకి యత్నించినప్పటికీ ఏ విధమైన వస్తువులు దొరకలేదని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ రవికుమార్‌, క్లూస్‌టీం, డాగ్‌స్వాడ్‌ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ శివనాగబాబు తెలిపారు. 

Updated Date - 2021-07-27T05:38:43+05:30 IST