పాలతో ఆభరణం!

ABN , First Publish Date - 2022-05-11T05:30:00+05:30 IST

కప్పు వేడి పాలలో వైట్‌ వెనిగర్‌ వేసి స్పూన్‌తో కలియబెట్టి చల్లారబెట్టాలి.

పాలతో ఆభరణం!

కావలసినవి

వేడి పాలు ఒకకప్పు, వైట్‌ వెనిగర్‌ నాలుగు స్పూన్లు, స్పూన్‌, టిష్యూ పేపర్‌, ప్లేట్‌, ఫుడ్‌ కలర్‌, టూత్‌పిక్‌


ఇలా చేయాలి...

కప్పు వేడి పాలలో వైట్‌ వెనిగర్‌ వేసి స్పూన్‌తో కలియబెట్టి చల్లారబెట్టాలి.

ప్లేట్‌లో టిష్యూపేపర్‌ను ఐదు లేయర్‌లుగా పరవాలి.

స్పూన్‌ సహాయంతో వెనిగర్‌ కలిపిన పాలను టిష్యూ పేపర్‌ మధ్యలో పోయాలి. తరువాత టిష్యూ పేపర్‌ చివరలు దగ్గరకు మలిచి అదనంగా ఉన్న నీళ్లు పోయేలా గట్టిగా ఒత్తాలి.

ఇప్పుడు ఆ మిశ్రమాన్ని తీసుకుని అందులో కొద్దిగా ఫుడ్‌ కలర్‌ కలిపి నచ్చిన ఆకారంలో తయారుచేసుకోవాలి. మెడలో ధరించేందుకు వీలుగా ఆభరణం కావాలనుకుంటే టూత్‌పిక్‌ సహాయంతో మధ్యలో చిన్న రంధ్రం చేయాలి. 

తరువాత రెండురోజుల పాటు ఆరబెడితే గట్టిగా అయి ఆభరణం రెడీ అవుతుంది.

Read more