కరెంట్ పోవడంతో ఉక్కపోత భరించలేక డాబా మీద పడుకునేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులు.. పొద్దునే కిందకు వచ్చి చూస్తే..

ABN , First Publish Date - 2022-06-28T22:18:34+05:30 IST

కరెంట్ పోయిందని ఆ కుటుంబ సభ్యులు రాత్రంతా డాబా మీద పడుక్కున్నారు.. ఉదయం లేచి కిందకు వచ్చి చూసి షాకయ్యారు..

కరెంట్ పోవడంతో ఉక్కపోత భరించలేక డాబా మీద పడుకునేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులు.. పొద్దునే కిందకు వచ్చి చూస్తే..

కరెంట్ పోయిందని ఆ కుటుంబ సభ్యులు రాత్రంతా డాబా మీద పడుక్కున్నారు.. ఉదయం లేచి కిందకు వచ్చి చూసి షాకయ్యారు.. ఎందుకంటే అప్పటికే తలుపులు తెరిచి ఉన్నాయి.. లోపల ఉండాల్సిన 13 కిలోల వెండి, 15 తులాల బంగారు ఆభరణాలు, 1.5 లక్షల నగదు మాయమయ్యాయి.. తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడిన దొంగలు ఈ చోరీకి పాల్పడి పరారయ్యారు.. బాధిత రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Viral Video: ఛీ..ఛీ.. స్విమ్మింగ్ పూల్‌లో ఇదేం పాడు పని.. ఎవరూ చూడటం లేదనుకుందో ఏమో కానీ..


అజ్మీర్‌కు సమీపంలోని కిషన్‌పురా గ్రామానికి చెందిన ఛగన్‌లాల్ కుటుంబ సభ్యులు భోజనం చేసి రాత్రి ఇంట్లోనే నిద్రపోయారు. కొంత సేపటికి కరెంట్ పోవడంతో గాలి వేస్తుందని అందరూ డాబా పైకి ఎక్కి నిద్రపోయారు. అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు పెట్టెలోని 13 కిలోల వెండి, 15 తులాల బంగారు ఆభరణాలు, 1.5 లక్షల నగదు చోరీ చేశారు. ఆ కుటుంబానికి చెందిన నలుగురు కోడళ్లు తమ నగలను ఒకే దగ్గర దాచుకున్నారు. 


వాటన్నింటినీ దొంగలు కాజేశారు. మొత్తం పోయిన బంగారం, వెండి విలువ దాదాపు 15 లక్షల రూపాయలు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల వెతికినా ఏమీ దొరకలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2022-06-28T22:18:34+05:30 IST