ఇండియన్ గ్లామర్ క్వీన్ శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెలుగులో అతిత్వరలో తెరంగేట్రం చేయడానికి శరవేగంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని జాన్వీ తండ్రి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, నటుడు బోనీ కపూర్ చిత్రజ్యోతికి తెలియజేశారు. తెలుగు, తమిళ్లో జాన్వీ ఎంట్రీ గురించి వస్తున్న వార్తలను బోనీ నిజమేనని అన్నారు. కాకపోతే రెగ్యులర్ మాస్‌మసాలా సినిమాలు కాకుండా స్ట్రాంగ్ స్టోరీతో పాటు, డాన్స్‌కి, జాన్వీ చేసే క్యారెక్టర్‌కి, పెరఫారమెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతో ప్రాధాన్యత ఉండి తీరాలని బోనీ తేల్చి చెప్పారు.
జాన్వీ తెలుగులోకి వస్తోందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నా కూడా బోనీ నుంచి డైరెక్టగా ఏ కన్ఫర్మేషన్ రాలేదు. మొదటిసారి చిత్రజ్యోతితోనే తన మనసులోని మాటను బోనీ పంచుకున్నారు. దాదాపుగా శ్రీదేవిలాగే కనిపించే జాన్వీకి బాలీవుడ్లో చాలా క్రేజ్ ఉంది. అయితే ఇప్పటివరకూ జాన్వీకి చెప్పుకోదగ్గ భారీ సక్సెస్ బాలీవుడ్‌లోనైతే లభించలేదు. శ్రీదేవి కూతురుగా మాత్రం విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది.
శ్రీదేవి పాపులర్ అయిందీ, సూపర్‌స్టార్ అయిందీ తెలుగు, తమిళం చిత్రాల ద్వారానే అన్నది బోనీ మనసులో గట్టిగా ముద్ర పడింది. ఆ ముద్రకి అనుగుణంగానే జాన్వీ కూడా తెలుగు, తమిళ చిత్రాల ద్వారానే సక్సెస్ అయి, స్టార్‌డమ్‌ని సాధించాలని బోనీ ఆశపడుతున్నారు. క్రియేటివ్ జీనియస్‌గా పేరుపడ్డ దర్శకుడు కృష్ణవంశీ త్వరలో తెలుగులో జాన్వీతో చెయ్యాలనుకుంటున్నట్టు కూడా చిత్రజ్యోతితో జాన్వీ గురించి తన అభిప్రాయాలను, ఫీలింగ్స్‌ని పంచుకున్నారు. శ్రీదేవిలాగే జాన్వీ కూడా చాలా ఆందమైనదని, బ్యూటిఫుల్ ఐస్ అని, గ్లాసీ ఫేస్ అని….ఇలా రకకాలుగా జాన్వీని అభివర్ణిస్తూ, జాన్వీ కోసమనే ఓ ప్రత్యేకమైన కథ కూడా అనుకున్నట్టు కృష్ణవంశీ చిత్రజ్యోతికి చెప్పారు.
బోనీ కపూర్ చెప్పినదానిని బట్టి, కృష్ణవంశీ అన్నదానిని బట్టి, వీళ్ళ కాంబినేషన్లోనే జాన్వీ మొడటి పిక్చర్ ఉండొచ్చన్నది తెలుస్తోంది. ప్రస్తుతం జాన్వీ బాలీవుడ్లో చేసిన చిత్రం రూహీ విడుదలకు తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఇందులో ఓ పాటకి జాన్వీ చేసిన డాన్స వీడియోను సోనీ మ్యూజిక్ సంస్థ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇందులో జాన్వీ చాలా క్లిష్టమైన బెల్లీ మూమెంట్స్‌ని అద్భుతంగా చేసింది. ఈ వీడియోకి లెక్కలేనన్ని లైకులు, షేర్లు చాలా స్పీడుగా వచ్చాయి. జాన్వీకున్న డాన్సింగ్ ఎబిలిటీ ద్వారానే బోనీ కూడా డాన్స్ ఇంపార్టెన్స్ మీద గురి పెట్టారనిపిస్తోంది.