Jharkhand: సీఎం సోరెన్ మైనింగ్ లీజు కేసు నేపథ్యంలో జార్ఖండ్ గవర్నర్ ఢిల్లీ పర్యటన

ABN , First Publish Date - 2022-08-22T17:04:30+05:30 IST

మైనింగ్ లీజు కేసులో అవినీతి ఆరోపణలపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్(CM Hemant Soren)న్యాయ పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్(Jharkhand Governor) రమేష్ బైస్ మూడు రోజుల పర్యటన కోసం...

Jharkhand: సీఎం సోరెన్ మైనింగ్ లీజు కేసు నేపథ్యంలో జార్ఖండ్ గవర్నర్ ఢిల్లీ పర్యటన

న్యూఢిల్లీ: మైనింగ్ లీజు కేసులో అవినీతి ఆరోపణలపై  జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్(CM Hemant Soren)న్యాయ పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్(Jharkhand Governor) రమేష్ బైస్ మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీకి(Delhi) వచ్చారు.ఈ పర్యటనలో భాగంగా గవర్నర్ రమేష్ బీజేపీ అగ్రనేతలను కలవనున్నారని సమాచారం. రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రిగా లీజులు మంజూరు చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోరేన్ పై జార్ఖండ్ హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా జార్ఖండ్ ప్రభుత్వం, సోరెన్ వేర్వేరు పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది.మరోవైపు భారత ఎన్నికల సంఘం (ECI) శుక్రవారం హేమంత్ సోరెన్‌పై ఈ కేసుపై విచారణ జరిపింది.(corruption charges in mining lease case)ఈసీఐ ప్రతికూల నిర్ణయం వెలువరిస్తే జార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయంగా గందరగోళం తలెత్తే అవకాశాలున్నాయి.


మైనింగ్ లీజు కేసులో(mining lease case) ప్రస్థుత సీఎం హేమంత్‌ సోరెన్‌ గతంలో గనుల శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ అంగద రాంచీలో లాభార్జన నిబంధనలను ఉల్లంఘించి రాయి క్వారీ గనులను కేటాయించారని ఫిర్యాదు చేస్తూ ఫిబ్రవరిలో గవర్నర్‌కు(Governor) బీజేపీ వినతిపత్రాన్ని సమర్పించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 9 ఎ ప్రకారం సీఎం సోరెన్ నిబంధనలను ఉల్లంఘించారని బీజేపీ నేతలు ఆరోపించారు. సీఎంగా సోరెన్ అనర్హుడిగా ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ వినతిపత్రాన్ని గవర్నర్ రమేష్ ఈసీకి పంపించారు.కాగా సీఎం హేమంత్ సోరెన్ తన అధికార నివాసంలో అధికార కూటమి ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి చర్చించారు.అధికార కూటమికి  చెందిన చాలా మంది శాసనసభ్యులు సమావేశానికి హాజరయ్యారు. మహారాష్ట్ర తర్వాత జార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల మధ్య సీఎం సోరెన్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించడం, గవర్నర్ 3రోజుల పాటు ఢిల్లీ పర్యటన జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.


Updated Date - 2022-08-22T17:04:30+05:30 IST