జిగ్నేష్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ.. 5 రోజులు పోలీస్ కస్టడీ

ABN , First Publish Date - 2022-04-26T23:26:29+05:30 IST

కాంగ్రెస్ ఎమ్మెల్యే, రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్ అధినేత జిగ్నేష్ మేవాని బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను అస్సాంలోని బర్పెట జిల్లా కోర్టు తిరస్కరించింది. దీంతో పాటు మేవానికి ఐదురోజుల పోలీసు కస్టడీకి కోర్టు ఆదేశించింది. పోలీసు అధికారులపై చేయి చేసుకున్నాడన్న కారణంతో బెయిల్ ఇచ్చిన..

జిగ్నేష్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ.. 5 రోజులు పోలీస్ కస్టడీ

గువహాటి: కాంగ్రెస్ ఎమ్మెల్యే, రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్ అధినేత జిగ్నేష్ మేవాని బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను అస్సాంలోని బర్పెట జిల్లా కోర్టు తిరస్కరించింది. దీంతో పాటు మేవానికి ఐదురోజుల పోలీసు కస్టడీకి కోర్టు ఆదేశించింది. పోలీసు అధికారులపై చేయి చేసుకున్నాడన్న కారణంతో బెయిల్ ఇచ్చిన అనంతరం మేవానీని పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. కాగా, మరోసారి బెయిల్ కోసం పిటిషన్ వేసుకోగా కోర్టు దాన్ని తిరస్కరించడం గమనార్హం. ప్రధాని మోదీపై వివాదస్పద ట్వీట్లు చేశాడని కేసు ఫైల్ కావడంతో కొద్ది రోజుల క్రితం మేవానీని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఆయనకు ఈ కేసులో సోమవారం బెయిల్ దొరికింది. ఈ బెయిల్ వచ్చిన కొద్ది సమయానికే పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించారని అదే రోజు మళ్లీ అరెస్ట్ చేశారు.

Updated Date - 2022-04-26T23:26:29+05:30 IST