మూడో త్రైమాసికంలో దూసుకెళ్లిన రిలయన్స్ జియో

ABN , First Publish Date - 2021-01-25T01:21:25+05:30 IST

దేశంలోని అతిపెద్ద టెలికం కంపెనీలలో ఒకటైన రిలయన్స్ జియో మరోమారు సత్తా చాటింది. డిసెంబరు 31తో

మూడో త్రైమాసికంలో దూసుకెళ్లిన రిలయన్స్ జియో

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద టెలికం కంపెనీలలో ఒకటైన రిలయన్స్ జియో మరోమారు సత్తా చాటింది. డిసెంబరు 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఏకంగా 25.1 మిలియన్ల మంది వినియోగదారులను చేర్చుకుంది. జియో నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేసేందుకు డబ్బులు వసూలు చేస్తూ వచ్చిన జియో ఈ నెల 1 నుంచి దానిని ఎత్తివేసి అన్ని కాల్స్‌ను మునుపటిలా ఉచితం చేయడం, స్మార్ట్‌ఫోన్ల షిప్‌మెంట్ పెరగడం వంటివి ఇందుకు కారణంగా తెలుస్తోంది. 


మూడో త్రైమాసికంలో 25.1 మిలియన్ల మంది తమ ఖాతాదారులుగా చేరినట్టు పేర్కొన్న జియో.. గతేడాది మొత్తంగా 40 మిలియన్ల మంది కొత్తగా వచ్చి చేరినట్టు తెలిపింది. టెలికం రంగంలోనే ఇది అత్యధికమని వివరించింది. ఇక, 31 డిసెంబరు 2020 నాటికి జియో మొత్తం ఖాతాదారుల సంఖ్య 410.8 మిలియన్లు. ఈ త్రైమాసికంలో జియో మొత్తం డేటా ట్రాఫిక్ 1,586 కోట్ల జీబీ. గతేడాదితో పోలిస్తే ఇది 28.4 శాతం అధికం. అలాగే, మొత్తం వాయిస్ ట్రాఫిక్ 18 శాతంపెరిగి 97,496 కోట్ల నిమిషాలకు చేరుకుంది.   


Updated Date - 2021-01-25T01:21:25+05:30 IST