జియో ప్రీపెయిడ్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఆ ప్లాన్‌పై 29 రోజుల అదనపు వ్యాలిడిటీ

ABN , First Publish Date - 2021-12-26T01:58:05+05:30 IST

దేశంలోని అగ్రగామి టెలికం సంస్థల్లో ఒకటైన రిలయన్స్ జియో న్యూ ఇయర్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ. 2,545..

జియో ప్రీపెయిడ్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఆ ప్లాన్‌పై 29 రోజుల అదనపు వ్యాలిడిటీ

న్యూఢిల్లీ: దేశంలోని అగ్రగామి టెలికం సంస్థల్లో ఒకటైన రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారులకు న్యూ ఇయర్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ. 2,545 ప్రీపెయిడ్ ప్లాన్‌పై 29 రోజుల అదనపు కాలపరిమితిని అందిస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం ఈ ప్లాన్ కాలపరిమితి 336 రోజులు కాగా, ఆఫర్‌లో భాగంగా 365 రోజులు లభించనుంది. జనవరి 2వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. 


రూ. 2,545 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లతోపాటు అపరిమిత వాయిస్ కాల్స్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే,, జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ప్రస్తుత వినియోగదారులతో పాటు కొత్త వినియోగదారులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని జియో తెలిపింది.

Updated Date - 2021-12-26T01:58:05+05:30 IST