దీపావళి నాటికి జియో ఫోన్‌ నెక్ట్స్‌

ABN , First Publish Date - 2021-10-26T08:26:45+05:30 IST

జియో ప్లాట్‌ఫారమ్స్‌ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ జియో ఫోన్‌ నెక్స్ట్‌ అధునాతన ప్రగతి ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో మార్కెట్లోకి వస్తోంది. జియో ప్లాట్‌ఫారమ్స్‌, గూగుల్‌ ఉమ్మడిగా ప్రగతి ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ను అభివృద్ధి చేశాయి.

దీపావళి నాటికి  జియో ఫోన్‌ నెక్ట్స్‌

 ధర అందరికీ అందుబాటులోనే...

న్యూఢిల్లీ: జియో ప్లాట్‌ఫారమ్స్‌ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ జియో ఫోన్‌ నెక్స్ట్‌ అధునాతన ప్రగతి ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో మార్కెట్లోకి వస్తోంది. జియో ప్లాట్‌ఫారమ్స్‌, గూగుల్‌ ఉమ్మడిగా ప్రగతి ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ను అభివృద్ధి చేశాయి. ఇది దీపావళి నాటికి మార్కెట్లోకి రాగలదని భావిస్తున్నారు. ప్రాంతీయ భాషలు మాట్లాడే వారు ఇతర భాషలు మాట్లాడే వారితో అనుసంఽధానం అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రజలను 2జీ విముక్తులను చేసి 4జీ వైపు ఆకర్షించేందుకు అందరూ భరించగల స్థాయిలో జియో నెక్స్ట్‌ను మార్కెట్లోకి తెస్తున్నామని ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రకటనకు అనుగుణంగా దీన్ని సోమవారం లాంఛనప్రాయంగా ఆవిష్కరించారు.


దీపావళి నాటికి దాన్ని మార్కెట్లో ప్రవేశపెడుతున్నట్టు కంపెనీ తెలిపింది. క్వాల్‌కామ్‌ చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌, టచ్‌ స్ర్కీన్‌ దీని ప్రత్యేకతలు. ఇది భాషా అనువాద ఫీచర్‌ కలిగి ఉంటుంది. దీని వల్ల అవతలి వ్యక్తి ప్రాంతీయ భాషలో చెప్పే సందేశం ఇవతలి వారికి వారి భాషలోనే వినే అవకాశం కలుగుతుంది. మొత్తం 10 భాషలను అనువాదం చేయగల సామర్థ్యం దానికి ఉంటుంది. స్ర్కీన్‌ మీద ఓపెన్‌ అయ్యే ఏ యాప్‌లో సమాచారం అయినా ఇది చదివి వినిపిస్తుంది. ఆర్‌ఐఎల్‌కు చెందిన  తిరుపతి, శ్రీ పెరంబుదూర్‌లోని నియోలింక్‌ యూనిట్‌లో ఈ ఫోన్‌ తయారవుతుంది. 

Updated Date - 2021-10-26T08:26:45+05:30 IST