JioFiber Festival Bonanza: జియో ఫైబర్ ఫెస్టివల్ బొనాంజా.. రూ. 4500 విలువైన ప్రయోజనాలు మీ సొంతం

ABN , First Publish Date - 2022-10-03T01:35:59+05:30 IST

దేశంలోనే అతిపెద్దదైన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) జియో ఫైబర్ మరో సరికొత్త ఆఫర్‌తో వచ్చేసింది. అక్టోబరు 1

JioFiber Festival Bonanza: జియో ఫైబర్ ఫెస్టివల్ బొనాంజా.. రూ. 4500 విలువైన ప్రయోజనాలు మీ సొంతం

న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్దదైన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) జియో ఫైబర్ మరో సరికొత్త ఆఫర్‌తో వచ్చేసింది. అక్టోబరు 1 నుంచి 9 వరకు తీసుకునే కనెక్షన్లు, కొత్త జియోఫైబర్ ప్లాన్లపై ఏకంగా రూ. 4,500 ప్రయోజనాలను అందిస్తున్నట్టు ప్రకటించింది. రెండు పోస్టు పెయిడ్ ప్లాన్లు కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఫెస్టివల్ ఆఫర్ (JioFiber Festival Bonanza) వర్తిస్తుంది. జియో ఫైబర్ (JioFiber) ప్రీపెయిడ్ ప్లాన్ల తర్వాత పోస్టుపెయిడ్ ప్లాన్లను ఎక్కువగా తీసుకొచ్చింది. జియో పైబర్(JioFiber) పోస్టుపెయిడ్ ప్లాన్లు రూ. 599, రూ. 899గా ఉన్నాయి. ఈ ప్లాన్లు ఏవీ కొత్తవి కానప్పటికీ ఈ నెల 1 నుంచి 9 వరకు ఆఫర్‌లో అందుబాటులో ఉంటాయి. 


జియో ఫైబర్ ఫెస్టవల్ బొనాంజా ఆఫర్ 2022 

పైన చెప్పుకున్న రూ. 4,500 విలువైన ప్రయోజనాలు అందుకోవాలంటే ఖాతాదారులు రూ. 599, రూ. 899 ప్లాన్లను రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. రూ. 599 ప్లాన్‌తో అయితే కనీసం ఆరు నెలలు, రూ. 899 ప్లాన్‌తో అయితే కనీసం మూడు నెలలు రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ ప్రయోజనాలు పొందగలుగుతారు. రూ.599 ప్లాన్‌లో రిలయన్స్ డిజిటల్‌పై రూ. 1000 తగ్గింపు లభిస్తుంది. మింత్రాపై రూ. 1000, అజియోపై రూ. 1000, ఇక్సిగోపై రూ. 1500 తగ్గింపు లభిస్తుంది. మొత్తంగా రూ. 4,500 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. 


 రూ. 599 పోస్టు పెయిడ్ ప్లాన్ 

రూ. 599 పోస్టు పెయిడ్ ప్లాన్‌లో 30 ఎంబీపీఎస్ వేగంతో 3.3 టీబీ డేటా నెల రోజుల కాలపరిమితితో లభిస్తుంది. ఇందులో 15 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్  సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. వీటితోపాటు 550కిపైగా ఆన్ డిమాండ్ టీవీ చానళ్లు కూడా బండిల్డ్‌గా వస్తాయి. ఉచిత జియో ఎస్‌బీటీ (Set-Top Box) కోసం మై జియో (My Jio) యాప్ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. అలాగే, 14 ఓటీటీ యాప్స్ రూ. 200కే అందుబాటులో ఉన్నాయి. రూ.899 ప్లాన్‌లోనూ రూ. 599 ప్లాన్‌లో ఉన్న ప్రయోజనాలే లభిస్తాయి. కాకపోతే ఇంటర్నెట్ వేగం 100 ఎంబీపీఎస్‌గా ఉంటుంది. 

Updated Date - 2022-10-03T01:35:59+05:30 IST