JioPhone Nextపై బ్రహ్మాండమైన ఆఫర్.. కొద్దిరోజులు మాత్రమే!
ABN , First Publish Date - 2022-05-19T21:55:34+05:30 IST
రిలయన్స్ జియో (Reliance Jio) మరో బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. దేశంలో స్మార్ట్ఫోన్లకు దూరంగా ఉన్న
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో (Reliance Jio) మరో బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. దేశంలో స్మార్ట్ఫోన్లకు దూరంగా ఉన్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చిన జియోఫోన్ నెక్స్ట్పై ఎక్స్చేంజ్ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ ఫోన్ అసలు ధర రూ. 6,499 కాగా, ఎక్స్చేంజ్ ఆఫర్‌పై రూ.2 వేల తగ్గింపుతో రూ. 4,499కే అందిస్తున్నట్టు ప్రకటించింది. పరిమిత కాలం పాటు అందుబాటులో ఉండే ఈ ఆఫర్లో భాగంగా వినియోగదారులు ఏదైనా పనిచేస్తున్న4 జీ స్మార్ట్‌ఫోన్, లేదంటే 4జీ ఫీచర్ ఫోన్‌తో ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్చేంజ్ చేసుకునేందుకు పాత ఫోన్ లేకుంటే మాత్రం రూ. 6,499 చెల్లించాల్సి ఉంటుంది.
మొత్తం ఒకేసారి చెల్లించి తీసుకోలేనివారు వాయిదాల పద్ధతిలోనూ ఈ ఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజుతో కలిసి తొలుత రూ. 2,500 చెల్లించి ఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. ఆ తర్వాత మిగతా మొత్తాన్ని 18/24 నెలల్లో సులభ వాయిదాల్లో చెల్లించొచ్చు.
జియో ఫోన్ నెక్స్ట్ స్పెసిఫికేషన్లు: 5.45 అంగుళాల మల్టీటచ్ హెచ్డీ+డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 13 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ షూటర్, డ్యూయల్ సిమ్, 4జీ సపోర్ట్, 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 215 ఎస్ఓసీ, 2జీబీ ర్యామ్, 32 జీబీ అంతర్గత మెమొరీ, 512జీబీ వరకు స్టోరేజీని పెంచుకునే వెసులుబాటు ఉన్న ఈ ఫోన్ ప్రగతి ఓఎస్‌తో పనిచేస్తుంది.