బీజేపీ నేత Jitta Balakrishna Reddy అరెస్ట్
ABN , First Publish Date - 2022-06-10T16:14:46+05:30 IST
బీజేపీ నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.
Hyderabad: బీజేపీ నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి (Balakrishna Reddy)ని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. అర్ధరాత్రి ఘట్ కేసర్ టోల్ గేట్ సమీపంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 2న (తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం) జిట్టా ఆధ్వర్యంలో అమరుల యాదిలో ఉద్యమ ఆకాంక్షల సాధన సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం కేసీఆర్ను కించపరిచే విధంగా ఓ స్కిట్ చేశారన్న ఆరోపణలతో జిట్టాను అరెస్టు చేసినట్లు సమాచారం. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం ఏంటని బాలకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులు ప్రజాస్వామ్య బద్దంగా సభలు, సమావేశాలు నిర్వహించుకునే హక్కులేదా? అని పోలీసులను నిలదీశారు.