కథువాలో బాంబులను మోసుకువచ్చిన Pakistan డ్రోన్ కూల్చివేత

ABN , First Publish Date - 2022-05-31T12:51:47+05:30 IST

జమ్మూకశ్మీరులోని కథువా సరిహద్దుల్లో బాంబులను మోసుకువచ్చిన పాకిస్థాన్ డ్రోన్‌ను జమ్మూకశ్మీర్ పోలీసులు కూల్చివేశారు....

కథువాలో బాంబులను మోసుకువచ్చిన Pakistan డ్రోన్ కూల్చివేత

కథువా (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులోని కథువా సరిహద్దుల్లో బాంబులను మోసుకువచ్చిన పాకిస్థాన్ డ్రోన్‌ను జమ్మూకశ్మీర్ పోలీసులు కూల్చివేశారు.ఈ ఏడాది అమర్ నాథ్ యాత్రపై ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దు అయిన కథువాలోని రాజ్ బాగ్ వద్ద పాక్ డ్రోన్ కనిపించింది. ఈ డ్రోన్ ను పోలీసులు కూల్చివేసి చూడగా అందులో పేలుడు పదార్థాలున్నాయి. దీంతో బాంబు నిర్వీర్యదళం సంఘటన స్థలానికి వచ్చి 7 మాగ్నెటిక్ స్టిక్కీ బాంబులు, గ్రెనెడ్లను స్వాధీనం చేసుకున్నారు. అమర్ నాథ్ యాత్రకు అంతరాయం కలిగించడానికి పాకిస్థాన్ పేలుడు పదార్థాలను డ్రోన్ ద్వారా తరలించిందని కథువా ఎస్పీ కొత్వాల్ చెప్పారు. దీంతో సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తం చేసి గాలింపులు జరుపుతున్నామని ఎస్పీ చెప్పారు.


 ప్రజలు ఏదైనా అనుమానాస్పద వస్తువులు కనిపించినా వెంటనే తెలియజేయాలని పోలీసులు కోరారు. ఈ నెల ప్రారంభంలో కత్రా పట్టణానికి సమీపంలో యాత్రికులు ఉన్న బస్సులో బాంబు వల్ల మంటలు చెలరేగాయి.అమరనాథ్ యాత్రకు అంతరాయం కలిగించేందుకు ఉగ్రవాదులు చేస్తున్న ప్రయత్నాలను భగ్నం చేసేందుకు పోలీసులు వ్యూహం రచిస్తున్నారు.


Updated Date - 2022-05-31T12:51:47+05:30 IST