నిబంధనలకు నీళ్లు

ABN , First Publish Date - 2021-04-18T05:49:06+05:30 IST

పీహెచడీ విద్యను జేఎనటీయూ ప్రొఫెసర్లు అభాసుపాలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు అతిక్రమించి, పదుల సంఖ్యలో పీహెచడీ విద్యార్థులకు గైడ్‌, కో-గైడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఏఐసీటీఈ (ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన), యూజీసీ (యూనివరిటీ గ్రాంట్స్‌ కమిషన) నిబంధనల ప్రకారం ఒక ప్రొఫెసర్‌ తన సర్వీసులో 8 మందికి పీహెచడీ అవార్డులు అందజేయ వచ్చు.

నిబంధనలకు నీళ్లు

పీహెచడీల్లో జేఎనటీయూ ప్రొఫెసర్ల ఇష్టారాజ్యం

 ఒక ప్రొఫెసర్‌ 8 మందికి మాత్రమే గైడ్‌గా వ్యవహరించాలంటున్న నిబంధనలు

 వందమంది దాకా వ్యవహరించిన వైనం..

 యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనలకు తిలోదకాలు

అనంతపురం అర్బన, ఏప్రిల్‌ 17: 

పీహెచడీ విద్యను జేఎనటీయూ ప్రొఫెసర్లు అభాసుపాలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు అతిక్రమించి, పదుల సంఖ్యలో పీహెచడీ విద్యార్థులకు గైడ్‌, కో-గైడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఏఐసీటీఈ (ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన), యూజీసీ (యూనివరిటీ గ్రాంట్స్‌ కమిషన) నిబంధనల ప్రకారం ఒక ప్రొఫెసర్‌ తన సర్వీసులో 8 మందికి పీహెచడీ అవార్డులు అందజేయ వచ్చు. జేఎనటీయూ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రొ ఫెసర్లు ఒక్కొక్కరు 40 నుంచి వంద మందికి పీహెచడీ గైడ్‌, కో-గైడ్‌గా వ్యవహరించారు. దీంతో పీహెచడీ ద్వారా నూతన పరిశోధనలు చేసి, సమాజంలో మార్పులు తీసుకురావచ్చునన్న ఏఐసీటీఈ, యూ జీసీ ప్రధాన లక్ష్యం నీరుగారుతోంది.


పరిశోధనలే లక్ష్యం

వివిధ విభాగాల్లో పీజీ పూర్తిచేసిన విద్యార్థులు వారికి ఆసక్తి ఉన్న సబ్జెక్టులో పరిశోధనలు చేసేందుకు ఏఐసీటీఈ, యూజీసీ సంయుక్తంగా ప్రోత్సహిస్తున్నాయి. ఇందుకు ప్రతి విశ్వవిద్యాలయంలో రీసెర్చ్‌, డెవల్‌పమెంట్‌ విభాగాన్ని ఏర్పాటు చేశారు. వ్యాపారం, వాణిజ్యం, నిర్మాణం, విద్యుత, కంప్యూటర్‌, అంతరిక్ష పరిశోధన, రసాయనం, మె కానిజం తదితర అంశాల్లో పరిశోధనలు చేసి, ఇ ప్పటివరకు ఎవరూ కనిపెట్టని కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకురావాలన్నదే పీహెచడీ ప్రధాన ఉద్దేశం. నాణ్యమైన పరిశోధనలు జరగాలన్న ల క్ష్యంతో పీహెచడీ అడ్మిషన నుంచి పట్టా ప్రదానం వరకు ఏఐసీటీఈ, యూజీసీ ప్రత్యేక నిబంధనలు రూపొందించాయి. దేశంలోని ఏ విశ్వవిద్యాలయమైనా ఈ నిబంధనలకు లోబడే వ్యవ హరించాల్సి ఉంది. ఇందులో భాగంగా ఒక ప్రొఫెసర్‌ తన జీవితకాలంలో 8 మంది పీహెచడీ వి ద్యార్థులకు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఆరుగురికి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నలుగురికి మాత్రమే పర్యవేక్షకుడిగా(గైడ్‌), సహ పర్యవేక్షకుడిగా (కో-గైడ్‌) వ్యవహరించాలనే నిబంధన విధించింది. పరిశీలనాత్మక పరిశోధన నిర్వహించి సమాజంలో మా ర్పు తీసుకురావాలన్నదే ఈ నిబంధన ప్రధాన లక్ష్యం. జేఎనటీయూ ప్రొఫెసర్లు మాత్రం పరిశోధనల ఫలితంతో తమకు సంబంధం లేదని, ఎంతమందికి పీహెచ డీ పర్యవేక్షకుడిగా వ్యవహరించామనే నిర్లక్ష్య ధోరణితో నిబంధనలకు తిలోదకాలిచ్చారు. పీహెచడీ అభ్యర్థుల నుంచి ఆయా ప్రొఫెసర్లు ప్రత్యక్ష, పరోక్ష లాభం పొందేందుకు నిబంధనలు గాలికొదిలేశారన్న ఆరోపణలున్నాయి.


పదేళ్లలో 2 వేల పీహెచడీలు

2009 నుంచి 2019వ సంవత్సరం వరకు దాదాపు 2వేల మందికి జేఎనటీయూ ఆధ్వర్యంలో పీహెచడీలు ప్రదానం చేశారు. ఇందులో జేఎనటీయూలో 1800, అనుబంధ కళాశాలల్లో 200 పీహెచడీలు ఉన్నాయి. జేఎనటీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో ప్రస్తుతం 39 మంది ప్రొఫెసర్లు, ఆరుగురు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 24 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు మొత్తం 69 మంది ఉన్నారు. రిటైర్డ్‌ అయినవారు, బదీలిపై వెళ్లిన వారు మరో పదిమంది ఉండచ్చునని అంచనా. ఒక్కొక్కరు 8 మంది పీహెచడీలకు పర్యవేక్షకుడిగా, సహ పర్యవేక్షకుడిగా వ్యవహరించినా 632 పీహెచడీ అవార్డులను మా త్రమే అందజేయాలి. పరి శోధనలకు ప్రాణవాయువులాంటి గైడ్‌, కో-గైడ్‌లు యథావిధిగా వారి విధులను కొనసాగిస్తూ పీహెచడీ వి ద్యార్థులను పర్యవేక్షించాలి. ఎక్కువమందికి పర్యవేక్షకుడిగా ఉంటే ఆ పరిశోధనల్లో స మాజానికి ఉపయోగపడే కొత్త విషయాలను వెలుగులోకి తీసుకురావడం లో విఫలమయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ అలాం టి పరిశోధనలు అమోదించి నా పీహెచడీలను పొందామన్న ఆనం దం విద్యార్థులకు, అవార్డులను అందజేశామన్న భావ న గైడ్‌, కో-గైడ్‌లకు కలుగుతుందే తప్పా.. సమాజానికి ఉపయోగం ఉండదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.


నిబంధనలు పాటించాల్సిందే..

పీహెచడీ విద్యార్థులు నూతన అంశాలపై పరిశోధనలు చే యాల్సి ఉంటుంది. వా రికి గైడ్‌, కో-గైడ్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్లు స లహాలు, సూచనలు ఇ స్తూ.. అనుమానాలను నివృత్తిచేస్తూ ప్రోత్సాహించాలి. స మాజానికి ఎలాంటి మేలు చేయాలనుకుంటున్నారో పరిశోధనల ద్వారా తెలియజేయాలి. ఇందులో గైడ్‌, కో-గైడ్‌లు ప్రధాన భూమిక పోషిస్తారు. ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాల్సి ఉంది. గైడ్‌, కో-గైడ్‌ల డేటాను పరిశీలించి, తగు చర్యలు తీసుకుంటాం.

- రంగ జనార్దన, వీసీ



Updated Date - 2021-04-18T05:49:06+05:30 IST