JNTUH పరిధిలో 16న జరగాల్సిన B.Tech/B.Pharm పరీక్షలు వాయిదా..!

ABN , First Publish Date - 2022-07-14T00:57:56+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం గురువారం నుంచి మూడు రోజుల పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవులు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్శిటీ తాజాగా కీలక ప్రకటన చేసింది.

JNTUH పరిధిలో 16న జరగాల్సిన B.Tech/B.Pharm పరీక్షలు వాయిదా..!

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం గురువారం నుంచి మూడు రోజుల పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవులు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ తాజాగా కీలక ప్రకటన చేసింది.  దీని ప్రకారం.. ఈ నెల 16న జరగాల్సిన బీటెక్, బీఫార్మసీ 4వ సంవత్సరం రెండవ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. అంతేకాకుండా.. బీటెక్/బీఫార్మసీ 3వ సంవత్సరం రెండవ సెమిస్టర్ మిడ్‌టర్మ్ పరీక్షలనూ వాయిదా వేశారు. పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో వెల్లడిస్తామని యూనివర్సిటీ పేర్కొంది. అయితే.. 21వ తారీఖు నుంచి జరిగే పరీక్షలన్నీ యథాతథంగా కొనసాగుతాయని పేర్కొంది. ఈ మేరకు అన్ని అనుబంధ కళాశాలలకు ఓ సర్క్యులర్ జారీ చేసింది.



Updated Date - 2022-07-14T00:57:56+05:30 IST