జేఎన్టీయూకేకు అవార్డు

ABN , First Publish Date - 2022-08-11T07:12:59+05:30 IST

భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫుడ్‌ సేప్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అఽథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అవార్డు, ఈట్‌ రైట్‌ క్యాంపస్‌ ధ్రువపత్రాన్ని, ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌తో గుర్తింపును కాకినాడ జేఎన్టీయూకే పొందినట్లు వర్సిటీ పీఆర్వో సీహెచ్‌ సాయిబాబు తెలిపారు.

జేఎన్టీయూకేకు అవార్డు
అవార్డు అందుకుంటున్న వీసీ

జేఎన్టీయూకే, ఆగస్టు 10: భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫుడ్‌ సేప్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అఽథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అవార్డు, ఈట్‌ రైట్‌ క్యాంపస్‌ ధ్రువపత్రాన్ని, ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌తో గుర్తింపును కాకినాడ జేఎన్టీయూకే పొందినట్లు వర్సిటీ పీఆర్వో సీహెచ్‌ సాయిబాబు తెలిపారు. ఇటువంటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డుకు జేఎన్టీయూకే ఎంపిక కావడం దక్షిణ భారతదేశంలో మొదటిది, జాతీయస్థాయిలో 3వ స్థానాన్ని పొందిందని అన్నారు. ఈ ధ్రువపత్రాన్ని రాష్ట్ర ఉన్నతవిద్యామండలి కార్యాలయంలో ఏపీఎస్సీహెచ్‌ఈ చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి బుధవారం వీసీ జీవీఆర్‌ ప్రసాదరాజు, స్కూల్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్‌ ఎం.రమేష్‌కు అందించారు. హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ ఐఐటీ గాంధీనగర్‌, ఐఐటీ ఆహ్మదాబాద్‌ తర్వాత ఈట్‌ రైట్‌ క్యాంపస్‌ ధృవపత్రాన్ని పొందిన విశ్వవిద్యాలయం జేఎన్టీయూకే మాత్రమేనన్నారు. అనంతరం వీసీ మాట్లాడుతూ ఈట్‌రైట్‌ క్యాంపస్‌ గురించి పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఆస్పత్రులు, టీ ఎస్టేట్‌లలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. డాక్టర్‌ రమేష్‌ మాట్లాడుతూ బీఎస్‌ఐ గ్రూప్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన ఆడిట్‌లో జేఎన్టీయూకేకు ఫైవ్‌స్టార్‌ స్కేల్‌ సర్టిఫికేషన్‌ రేటింగ్‌ వచ్చిందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఎల్‌.సుమలత, కృష్ణమోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T07:12:59+05:30 IST