జూలై 2న మహిళలకు Job Fair

ABN , First Publish Date - 2022-06-27T21:54:00+05:30 IST

జాబ్‌ పోర్టల్‌ ‘మైఅవతార్‌.కామ్‌’ ప్రత్యేకించి మహిళల కోసం జూలై 2న జాబ్‌ ఫెయిర్‌ను నిర్వహిస్తోంది. ఈ ఫెయిర్‌ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. వర్కింగ్‌ ఉమన్‌

జూలై 2న మహిళలకు Job Fair

జాబ్‌ పోర్టల్‌ ‘మైఅవతార్‌.కామ్‌’ ప్రత్యేకించి మహిళల కోసం జూలై 2న జాబ్‌ ఫెయిర్‌ను నిర్వహిస్తోంది. ఈ ఫెయిర్‌ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. వర్కింగ్‌ ఉమన్‌ నుంచి మళ్ళీ జాబ్‌ కోసం యత్నిస్తున్న మహిళలవరకు అందరూ ఈ జాబ్‌ఫెయిర్‌లో పాల్గొనవచ్చు. భిన్న కెరీర్లు అంటే బ్యాంకింగ్‌, టెక్నాలజీ, ఫైనాన్స్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, మాన్యుఫాక్చరింగ్‌లో మహిళలకు ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకుని మరీ ఈ జాబ్‌ పోర్టల్‌ రెండు దశాబ్దాలుగా కృషి చేస్తోంది. అమెజాన్‌ టైటాన్‌, వెస్తాస్‌, అస్ట్రాజెనకా, క్రిసిల్‌, బ్లూస్టార్‌ లిమిటెడ్‌ తదితర కంపెనీలు ఈ ఫెయిర్‌లో పాల్గొంటున్నాయి. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ చూడవచ్చు. 

జాబ్‌ లింక్‌: https://www.myavtar.com/events/details/11

వెబ్‌సైట్‌:  myAvtar.com 

Updated Date - 2022-06-27T21:54:00+05:30 IST