ప్రోగ్రామర్‌ ఉద్యోగమంటూ మోసం

ABN , First Publish Date - 2022-06-26T16:58:27+05:30 IST

జావా ప్రోగ్రా మర్‌గా ఉద్యోగం ఇప్పిస్తామని, ఏడాదికి రూ. 13లక్షలు జీతం వస్తుందని నమ్మించి నగర యువతి నంచి రూ.1.95లక్షలు

ప్రోగ్రామర్‌ ఉద్యోగమంటూ మోసం

యువతి నంచి రూ. 1.95లక్షలు కొల్లగొట్టిన సైబర్‌ నేరగాళ్లు 

బాధితురాలి ఫిర్యాదు

హైదరాబాద్‌ సిటీ: జావా ప్రోగ్రా మర్‌గా ఉద్యోగం ఇప్పిస్తామని, ఏడాదికి రూ. 13లక్షలు జీతం వస్తుందని నమ్మించి నగర యువతి నంచి రూ.1.95లక్షలు కొల్లగొట్టారు సైబర్‌ నేరగాళ్లు. బాధితురాలు సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాజేంద్రనగర్‌కు చెందిన యువతి ఎంటెక్‌ పూర్తిచేసి ఉద్యోగ అన్వేషణలో ఉంది. గతేడాది మేలో ఒక జాబ్‌ పోర్టల్‌లో తన రెజ్యూమ్‌ను అప్‌లోడ్‌ చేసింది. ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్‌కు చెందిన ఓరాకిల్‌ టెక్నాల జీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ ప్రతినిధినంటూ రాజీవ్‌ అనే వ్యక్తి బాధిత యువతికి ఫోన్‌ చేశారు. మీ రెజ్యూమ్‌ మా షార్ట్‌లిస్టులో సెలక్ట్‌ అయింది. జావా ప్రోగామర్‌గా ఉద్యోగం ఇప్పిస్తాం. జీతం ఏడాదికి రూ. 13లక్షలు అని నమ్మించారు. మూడు సార్లు జూ మ్‌లో ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి సెలక్టు అయినట్లు చెప్పారు. విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలతో పాటు, ఆధార్‌, పాన్‌కార్డు తెప్పించుకున్నారు. జాబ్‌ అగ్రిమెంట్‌ లెటర్‌ను కొరియర్‌లో పంపారు. బ్యాక్‌డోర్‌ ఉద్యోగాలు కావడంతో ప్రాసె సింగ్‌ ఫీజులు ఇతర చార్జిల కింద కొంత డబ్బు చెల్లించాలని నమ్మించారు. విడతల వారీగా రూ. 1.95లక్షలు కొల్లగొట్టారు. ఆ తర్వాత స్పందించడం మానేశారు. ఎంతకీ ఉద్యోగం రాకపో వడంతో ఆ యువతి వారిని నిలదీసింది. తన డబ్బులు వెనక్కి ఇచ్చేయాలంది. దాంతో రాజీవ్‌ రూ.1లక్షకు సౌత్‌ఇండియా బ్యాంకు చెక్కును పంపాడు. ఆ చెక్కును తీసుకొని బ్యాంకుకు వెళ్లగా ఖాతాలో డబ్బులు లేవు. మోసపోయానని గుర్తించిన యువతి సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-06-26T16:58:27+05:30 IST