నిరంతర శ్రమతో ఉద్యోగ సాధన : ఎస్పీ

ABN , First Publish Date - 2022-05-14T06:25:25+05:30 IST

స్థానిక జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో జిల్లా సోషల్‌ వెల్ఫేర్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉచిత పోలీసు శిక్షన శిబిరాన్ని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ శిక్షణ శిబిరంలో ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాలకు చెందిన షెడ్యుల్‌ క్యాస్ట్‌కు సంబంధించిన యువకులకు

నిరంతర శ్రమతో ఉద్యోగ సాధన : ఎస్పీ
శిక్షణ శిబిరాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకుంటున్న ఎస్పీ

ఆదిలాబాద్‌ టౌన్‌, మే 13: స్థానిక జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో జిల్లా సోషల్‌ వెల్ఫేర్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉచిత పోలీసు శిక్షన శిబిరాన్ని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ శిక్షణ శిబిరంలో ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాలకు చెందిన షెడ్యుల్‌ క్యాస్ట్‌కు సంబంధించిన యువకులకు ఉచితంగా పోలీసు కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన శారీరక, బోధన తరగతులకు సంబంధించిన విభాగాలలో శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిరంతరంగా కఠోర శ్రమతో చదవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాన్ని ఖచ్చితంగా సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు. ప్రతి రోజు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుని సొంతంగా నోట్స్‌ తయారు చేసుకుని కష్టపడి చదివిన వారికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగాలలో ఏదైనా ఒక ఉద్యోగం కచ్చితంగా సాధింవచ్చని విద్యార్థుల్లో మనో ధైర్యం పెంపొందించే విధంగా సూచనలు చేశారు. పోటీ పరీక్షలకు కావాల్సిన సెలబస్‌ను పూర్తిగా చదివి, ఎటువంటి సందేహాలు ఉన్న సంబంధిత అధ్యాపకులను అడిగి వెంటనే నివృత్తి చేసుకుని క్రమశిక్షణతో, శ్రద్ధతో చెప్పిన పాఠ్యాంశాలను నెమరువేస్తూ శిక్షణను పూర్తి చేయాలని సూచించారు. తల్లిదండ్రులకు తమపై ఎన్నో ఆశలు కళలు ఉంటాయని వాటిని నేరవేర్చడం, సమాజంలో తనకంటూ ఒక గౌరవం ఏర్పాటు చేసుకోవడం అనేవి జీవితంలో చాలా ముఖ్యమైన అంశాలు వీటిని సాధించడమే ప్రస్తుతం మీ ముందున్న ప్రధాన లక్ష్యంగా కొనసాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ బి. సునిత, అడిషనల్‌ ఎస్పీ సి.సమయ్‌జాన్‌రావు, సీఐ పి.గంగాధర్‌, ఆర్‌ఐ గడిగొప్పుల వేణు, డీటీసీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Read more