ఉద్యోగ భద్రత కల్పించాలి

ABN , First Publish Date - 2022-07-05T04:44:43+05:30 IST

ఎన్నో ఏళ్లుగా ప్రజాపంపిణీ వ్యవస్థలో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని రేషన్‌ డీలర్ల సంఘం పట్టణ అధ్యక్షుడు ఎండీ ఖదీర్‌ కోరారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి
గద్వాల తహసీల్దార్‌ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తున్న రేషన్‌ డీలర్లు

- రేషన్‌ డీలర్ల డిమాండ్‌

- తహసీల్దార్‌ కార్యాలయాల ముందు ఆందోళన

గద్వాల టౌన్‌, జూలై 4 : ఎన్నో ఏళ్లుగా ప్రజాపంపిణీ వ్యవస్థలో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని రేషన్‌ డీలర్ల సంఘం పట్టణ అధ్యక్షుడు ఎండీ ఖదీర్‌ కోరారు. గద్వాల తహసీల్దార్‌ కార్యాలయం ముందు సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సంద ర్భంగా ఖదీర్‌ మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్క రించాలని అధికారుల ద్వారా ప్రభుత్వానికి అనేక సంద ర్భాల్లో విన్నవించినా ఇప్పటివరకు స్పందించక పోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమ స్యను గుర్తించి, క్వింటాలుకు కమీషన్‌ రూ.440 లకు పెంచాలని, ఉద్యగ భద్రత కల్పించాలని, అన్‌లోడింగ్‌ చార్జీలు ప్రభుత్వమే భరించాలని, లైసెన్స్‌ల రెన్యువల్‌ను ఐదు సంవత్సరాలకు ఒకసారి చేపట్టాలని కోరారు. దీక్షలో ఎంఏ ఘనీ, ఎం.చంద్రశేఖరయ్య, కే. సవారన్న, టి. శ్రీనివాసులు, రంజిత్‌కుమార్‌ పాల్గొన్నారు. 


గట్టు : రేషన్‌ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని ఆల్‌ ఇండియా రేషన్‌ డీలర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం గట్టు తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అంతకుముందు మాత అంబాభవానీ ఆలయం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడు తూ ఒకే దేశం ఒకే రేషన్‌ అన్నప్పుడు కమీషన్‌ కూడా దేశమంతా ఒకేలా ఉండాలని వారు డిమాండ్‌ చేశారు. చౌకధర దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులను కూడా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు ఉదయ్‌ కాంత్‌, సభ్యులు నల్లారెడ్డి, శ్యామలమ్మ, రాయన్ననాయుడు, తిమ్మప్ప, భాస్కర్‌,  వీరమ్మ, నర్శింహులు పాల్గొన్నారు.


ఇటిక్యాల : హక్కుల సాధనకై రేషన్‌ డీలర్లు సోమ వారం ఇటిక్యాల తహసీల్దార్‌ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రేషన్‌డీలర్ల సంఘం అధ్యక్షుడు యుగంధర్‌రెడ్డి మాట్లాడుతూ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా డీలర్లకు కమీషన్లు ఇస్తున్నారని, తెలంగాణలో తక్కువ కమీషన్‌ ఇస్తున్నారని తెలిపారు. న్యాయమైన కమీషన్‌ ఇచ్చే వరకు ఆందోళనలు చేపడతామని తెలిపారు. అనంతరం తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యానికి వినతిపత్రం అందించారు. 


అయిజ : అయిజ తహసీల్దార్‌ కార్యాలయం ముందు సోమవారం రేషన్‌ డీలర్లు ధర్నా చేశారు. కార్యక్రమంలో డీలర్లు రాముడు, ఫైల్‌మాన్‌, శ్రీనివాసులు, వీరన్న పాల్గొన్నారు.  


మల్దకల్‌ : న్యాయమైన హక్కుల సాధనకు మల్దకల్‌ మండల రేషన్‌ డీలర్లు తహసీల్దార్‌ కార్యాలయం ముందు రేషన్‌ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్‌ సరితారాణికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేష్‌ బాబు, డీలర్లు తిప్పన్ననాయుడు, గోపాల్‌రెడ్డి, మల్లికార్జున్‌, సుధాకర్‌, రంగమ్మ, ఈశ్వరమ్మ, వినోదాచారి, శంకర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 


రాజోలి : హక్కుల సాధన కోసం రేషన్‌ డీలర్లు రాజోలి తహసీల్దార్‌ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్‌ గ్రేసీబాయికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో రేషన్‌ డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు నాగరాజు, ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి అంజయ్య, కోషాధికారి నరేంద్ర యాదవ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-07-05T04:44:43+05:30 IST