ఏపీలో గ్రూప్స్ సాధించలేకపోయిన నిరుద్యోగులు సివిల్స్ ఎలా కొట్టారు?

Sep 25 2021 @ 19:54PM

అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్స్ పరీక్షల్లో ఆరుగురు అర్హత సాధించలేకపోయారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన ఫలితాల్లో మాత్రం టాప్ ర్యాంక్ సాధించారు. ఇలా జరగడంపై ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయి. ర్యాంకులు ఎలా సాధించగలిగారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గ్రూప్ 1 పరీక్షల్లో అన్యాయం జరుగుతుందని పరీక్ష రాసిన నిరుద్యోగులు కొద్ది రోజుల క్రితం ఉద్యమం చేశారు. కొంతమంది రాజకీయ నాయకులు ఈ పోస్టులను ముందే అమ్ముకున్నారని వాళ్లు ఆరోపించారు. అంతేకాదు ఓ ఆరుగురు నిరుద్యోగులు కోర్టుకు కూడా వెళ్లారు. జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. రేపో మాపో తీర్పు వచ్చే అవకాశం ఉంది. 

అయితే  తాజాగా యూపీపీఎస్సీలో విడుదల చేసిన ఫలితాల్లో ఈ ఆరుగురు టాప్ ర్యాంక్ సాధించడాన్ని బట్టి చూస్తే ఏపీపీఎస్సీలో ఏదో జరిగిందనేది నమ్మాల్సి వస్తోంది. ఈ ఆరుగురు చేసిన ఆరోపణలు కరెక్టే కదా అని అనిపిస్తుంది. యూపీపీఎస్సీకి సెలక్ట్ అయిన వాళ్లు ఏపీపీఎస్సీకి సెలక్ట్ కాలేరా?. అనే ప్రశ్నలు, అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఈ అంశాలే ఏపీలో చర్చనీయాంశంగా మారింది. 


ఈ నేపథ్యంలో  ‘‘ఏపీలో గ్రూప్స్ సాధించలేకపోయిన నిరుద్యోగులు సివిల్స్ ఎలా కొట్టారు?. ఏపీపీఎస్సీ మొట్టు ఎక్కలేని వారు ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్లు ఎలా అయ్యారు?. ఏపీలో గ్రూప్స్ రాసిన అభ్యర్థులు అక్రమాలు జరుగుతున్నాయంటూ ఎందుకు ఉద్యమించారు?. ఏపీపీఎస్సీపై కోర్టు కేసు వేసిన వారే సివిల్స్ సాధించడం దేనికి నిదర్శనం?. ఏపీలో గ్రూప్ వన్ ఉద్యోగాలను వేలంపాట పెట్టారని వచ్చిన ఆరోపణలు నిజమేనా?.  అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.