చిత్తూరు జిల్లాలో ఉద్యోగాలు.. నెలకు జీతం రూ.19వేలు

ABN , First Publish Date - 2021-12-12T17:55:07+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన..

చిత్తూరు జిల్లాలో ఉద్యోగాలు.. నెలకు జీతం రూ.19వేలు

DMHO, Chittoorలో ఫార్మసిస్ట్‌లు


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన చిత్తూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌ఓ) ఒప్పంద ప్రాతిపదికన 26 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.


పోస్టు: ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌-2

అర్హత: ఇంటర్మీడియెట్‌తోపాటు రెండేళ్ల డిప్లొమా(ఫార్మసీ) కోర్సు/ బ్యాచిలర్‌ ఫార్మసీ ఉత్తీర్ణత. ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్టరై ఉండాలి.

వయస్సు: 2021 జూలై 1 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.19,019 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, కోర్సు వెయిటేజ్‌, సర్వీస్‌ వెయిటేజ్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా

దరఖాస్తుకు చివరితేదీ: డిసెంబరు 21

చిరునామా: డీఎంహెచ్‌ఓ, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్‌

వెబ్‌సైట్‌: https://chittoor.ap.gov.in/



Updated Date - 2021-12-12T17:55:07+05:30 IST