
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఒంగోలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల(జీజీహెచ్) ఒప్పంద/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 14 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: పర్ప్యూజనిస్ట్: 2; ఎంఆర్ఐ టెక్నిషియన్: 2; సీటీ టెక్నీషియన్: 2; డయాలసిసిస్ టెక్నీషియన్: 4; కాథ్ లాబ్ టెక్నీషియన్: 2; ఫార్మసిస్ట్: 2
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత. సంబంధిత కోర్సుల సర్టిఫికెట్లతో పాటు అనుభవం ఉండాలి. ఏపీ పారా మెడికల్ బోర్డులో రిజిస్టరై ఉండాలి.
వయసు: 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: పోస్టులను బట్టి నెలకు రూ.17,500 నుంచి రూ.28,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా.
ఫీజు: ఇతరులు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 4
చిరునామా: ద సూపరింటెండెంట్, రూమ్ నం. 124, ప్రభుత్వ సర్వజన వైద్యశాల, ఒంగోలు, ప్రకాశం జిల్లా.
వెబ్సైట్: https://prakasam.ap.gov.in/