రైల్వేలో 1785 ఉద్యోగాలు.. రేపే చివరి తేదీ

ABN , First Publish Date - 2021-12-13T18:51:22+05:30 IST

పోస్టుల భ‌ర్తీకి..

రైల్వేలో 1785 ఉద్యోగాలు.. రేపే చివరి తేదీ

ఇంటర్‌నెట్‌డెస్క్: సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ప‌లు అప్రెంటీస్ పోస్టుల భ‌ర్తీకి నవంబర్ 15న నోటిఫికేష‌న్ విడుదల‌ అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 1785 అప్రెంటీస్ ఖాళీల‌ను భర్తీ చేయ‌నున్నారు. ఆన్‌లైన్ పద్ధతిలో ఈ పోస్టుల‌కు ధ‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అప్రెంటిస్ పోస్టులకు కనీస వయస్సు 15 సంవత్సరాలు కాగా, గరిష్ట వయస్సు 24 సంవత్సరాలు ఉండాలి. మరిన్ని వివరాలను అధికారిక వెబ్‌సైట్ rrcser.co.in ద్వారా తెలుసుకోండి. అయితే ఈ అప్రెంటీస్ ఖాళీల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి మిగిలింది ఒక్కరోజే. 


అర్హత: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ చ‌దివి ఉండాలి. ఐటీఐ స‌ర్టిఫికెట్ క‌లిగి ఉండాలి.

వయసు: 15 నుంచి 24 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్ట్ చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 14

వెబ్‌సైట్‌:  https://rrcser.co.in/pdf/act_2122.pdf

Updated Date - 2021-12-13T18:51:22+05:30 IST