ESICలో ఉద్యోగాలు... తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులంటే..

ABN , First Publish Date - 2022-01-04T21:37:23+05:30 IST

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఈఎస్‌ఐసీ), తెలంగాణ, ఏపీ రీజీయన్ల పరిధుల్లో వివిధ ఖాళీల భర్తీకి విడి, విడిగా నోటిఫికేషన్లు జారీ చేసింది.

ESICలో ఉద్యోగాలు... తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులంటే..

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఈఎస్‌ఐసీ), తెలంగాణ, ఏపీ రీజీయన్ల పరిధుల్లో వివిధ ఖాళీల భర్తీకి విడి, విడిగా నోటిఫికేషన్లు జారీ చేసింది.

తెలంగాణ రీజియన్‌లో మొత్తం ఖాళీలు: 72

పోస్టులు: అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌(యూడీసీ): 25; స్టెనోగ్రాఫర్‌: 04; మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(ఎంటీఎస్‌): 43

ఏపీ రీజియన్‌లో మొత్తం ఖాళీలు: 35

పోస్టులు: అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌(యూడీసీ):07; స్టెనోగ్రాఫర్‌: 02; మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(ఎంటీఎస్‌): 26

అర్హత: ఎంటీఎస్‌ పోస్టులకు పదో తరగతి/తత్సమాన, స్టెనోగ్రాఫర్‌ పోస్టులు ఇంటర్‌, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: యూడీసీ, స్టెనో పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు, ఎంటీఎస్‌ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: యూడీసీ, స్టెనో పోస్టులకు పే లెవల్‌-4 ప్రకారం రూ.25,500 నుంచి రూ.81,100, ఎంటీఎస్‌ పోస్టులకు లెవల్‌-1 ప్రకారం రూ.18,000 నుంచి రూ.56, వరకు చెల్లిస్తారు. 

ఎంపిక: రాత పరీక్ష(ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా 

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.500; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: జనవరి 15

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 15

వెబ్‌సైట్‌: www.esic.nic.in/

Updated Date - 2022-01-04T21:37:23+05:30 IST